చంద్రగిరిలో టీడీపీ, వైసీపీ మధ్య నలిగిపోతున్న పోలీసులు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖాకీలకు కొన్ని పోలీస్ స్టేషన్లపై సెంటిమెంట్ ఎక్కువ. కలిసి వస్తుంది అనుకుంటే.. పోస్టింగ్‌ల కోసం ఓ రేంజ్‌లో పైరవీలు చేస్తారు. అదే రివర్స్‌లో ఉంటే పోలీస్ స్టేషన్ పేరు చెబితేనే హడలెత్తిపోతారు. ప్రస్తుతం ఆ PS గురించి అదే చర్చ జరుగుతోంది. మాకొద్దీ తలనొప్పి అని విసుగెత్తిపోతున్నారట అధికారులు. వైసీపీ, టీడీపీ మధ్యలో పోలీస్‌గా చర్చల్లో ఉన్న ఆ కథేంటో ఈ స్టోరీలో చూద్దాం.
అధికారులు లేక స్టేషన్ ఖాళీ!
Also Read
చిత్తూరు జిల్లా చంద్రగిరి. పోలీస్‌శాఖ పరంగా సమస్యాత్మక ప్రాంతం. అనేక సమస్యలు తిష్ట వేశాయి. ఎక్కడ అలజడి రేగిన ఇంఛార్జ్ అధికారులు పరుగులు పెట్టాల్సి వస్తోంది. డీఎస్పీ కోసం ఎదురు చూడక తప్పడం లేదు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత మండలంలోనే ఈ పీఎస్ ఉంది. ప్రస్తుతం అధికారులు లేక స్టేషన్ ఖాళీ.
పని ఒత్తిడికి చంద్రగిరిలో పోస్టింగ్ అంటే హడల్!
చంద్రగిరి మండల పరిధిలో రెండు జాతీయ రహదారులు, స్వర్ణముఖి, భీమా నదులు, రాయలవారి కోట, శ్రీనివాసమంగాపురం, శేషాచల అడవులు, శ్రీవారిమెట్టు ప్రాంతాలు ఉన్నాయి. శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే వీఐపీల తాకిడి ఎక్కువ. పూతలపట్టు, నాయుడుపేట జాతీయ రహదారి 16 కిలోమీటర్లు చంద్రగిరిలో కలుస్తుంది. ఈ హైవేలో రోడ్డు ప్రమాదాలూ ఎక్కువే. తిరుపతి, మదనపల్లి జాతీయ రహదారి 15 కిలోమీటర్లు ఈ మండలంలోనే ఉంది. ఈ హైవేలోనే భాకరాపేట ఘాట్ రోడ్డ కూడా ఉంది. ఇసుక, గ్రావెల్, ఎర్రచందనం మాఫియాల గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ చంద్రగిరి పోలీస్‌స్టేషన్‌లో ఆ పని ఒత్తిడికి తగ్గట్టు మెన్ ఉండటం లేదు. దీంతో పని ఒత్తిడికి అధికారులు అక్కడ పోస్టింగ్ అంటేనే భయపడే పరిస్థితి.
పొలిటికల్ దెబ్బలకు పారిపోతున్న పోలీసులు!
చంద్రగిరి పిఎస్ పరిధిలోనే పొలిటికల్ పార్టీల సభలు, సమావేశాలు, ధర్నాలు, నిరసనలు, ఆందోళనలతో ఎప్పుడూ హాట్ హాట్‌గా ఉంటుంది. మాజీ సీఎం చంద్రబాబు నివాసం ఉండేది ఈ పీఎస్ పరిధిలోనే. దీంతో వైసీపీ, టీడీపీ నేతల మధ్య రాజకీయ గొడవలు కామన్. ఇవి పోలీస్ స్టేసన్‌కు చేరితే పోలీసులు చెప్పింది వినరు.. పైగా ఖాకీలకు వార్నింగ్‌లు వెళ్తుంటాయి. దీంతో అడకత్తెరలో పోక చక్కలా మారింది పోలీసుల పరిస్థితి. అటు చెప్తే వాళ్లకు కోపం.. ఇటు చెప్పతే వీళ్లకు కోపం అన్నట్టు అయ్యింది. దీంతో మాకొద్దు బాబు ఈ స్టేషన్ అంటున్నారట. సహజంగా హైవేల పరిధిలో ఉన్న స్టేషన్లలో పోస్టింగ్‌లకు బాగా గిరాకీ ఉంటుంది. కానీ ఇక్కడ హైవే ఉన్న.. పొలిటికల్ దెబ్బలకు పోలీసులు పారిపోతున్నారు.
రోజూ డీఎస్పీ కోసం ఎదురుచూపులే!
ఆ మధ్య జరిగిన పంచాయితీ ఎన్నికలే దీనికి నిదర్శనం. రాజకీయ గొడవలు పీక్‌కు వెళ్లడంతో 2 నెలలుగా ఎస్‌ఐలు లేరు. మెడికల్ లీవ్‌లో వెళ్లిన సీఐ తిరిగి రాలేదు. కేసులు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. బాధితులు వస్తే తిప్పి పంపేస్తున్నారు కానిస్టేబుళ్లు. పదిరోజుల క్రితం ఇంఛార్జ్‌గా వచ్చిన ఓ సిఐ శ్రీకాళహస్తిలో పోస్టింగ్ రావడంతో వెళ్లిపోయారు. మరో ఇంఛార్జ్ సీఐ ఉన్నా వీలు చూసుకుని విధులకు హాజరుకావడంతో బాధితులు తలలు పట్టుకుంటున్నారు. కేసుల పరిష్కారానికి డీఎస్పీ కోసం రోజూ ఎదురుచూడాల్సిన పరిస్థితి. మరి.. చంద్రగిరి పోలీస్ స్టేషన్ పొలిటికల్ కౌగిలి నుంచి ఎప్పుడు బయటపడుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
-
Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
-
IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
-
Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!