50:50 శాతం నీటి కేటాయింపు పగటి కలే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జల జగడం కొనసాగుతూనే ఉంది.. రెండు రాష్ట్రాల మధ్య నీటి వాటాను 50:50 శాతంగా పంచాలని డిమాండ్ చేస్తోంది తెలంగాణ సర్కార్.. అయితే, తెలంగాణ కోరుతున్న 50:50 శాతం నీటి కేటాయింపులు పగటి కలే అని వ్యాఖ్యానించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి.. కేఆర్‌ఎంబీకి లేఖ రాసినట్లు 70:30 శాతం నీటి కేటాయింపులు గతంలోనే చేశారన్న ఆయన.. రాష్ట్ర విభజన సమయంలో రెండు రాష్ట్రాలు చేసుకున్న ఒప్పందం 70:30 ప్రకారమే ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు.. దీనిలో కొత్త వాదన ఏమీ లేదన్న ఆయన.. అంగీకరించిన విషయాన్ని తెలంగాణ ప్రశ్నించటం అసంబద్ధం అన్నారు.
మరోవైపు.. టీడీపీకి ఈ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదని మండిపడ్డారు సజ్జల… వారి హయాంలో ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ ఘోరంగా విఫలమైందన్న ఆయన.. మా ప్రభుత్వం వచ్చిన తర్వాతే దళితులు, మహిళలపై దాడులు అరికట్టడానికి సమగ్ర ప్రణాళిక రూపొందించాం అన్నారు.. మహిళల భద్రత గురించి చంద్రబాబు ఎప్పుడైనా పట్టించుకున్నారా? అని ప్రశ్నించిన ఆయన.. రిషితేశ్వరి కేసు ఇప్పటికీ కొలిక్కి రాలేదు.. ఎస్సీల పై రిపోర్ట్ కాని దాడులు , లెక్కలేనన్ని టీడీపీ హయాంలో జరిగాయని ఆరోపించారు. రమ్య ఘటన పై ఎస్సీ జాతీయ కమిషన్ వైస్ ఛైర్మన్ ప్రభుత్వం వందకు రెండు వందల శాతం పని చేసిందని ప్రశంసించారని ఈ సందర్భంగా వ్యాఖ్యానించిన ఆయన.. దిశ చట్టం ఇంకా కేంద్రం దగ్గరే ఉందన్నారు.. మహిళల భద్రత కోసం దిశ లాంటి చట్టం తీసుకు రావాలన్న ఆలోచన అయినా చంద్రబాబు, లోకేష్ చేశారా? అని నిలదీశారు. గతంలో దేవాలయాలపై దాడులు అంటూ క్యాంపైన్ చేశారు… ఇప్పుడు దళితుల అంశాన్ని రాజకీయం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.
Also Read
- Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
- Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
- PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్‌డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
తాజావార్తలు
-
Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
-
Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
-
Prithvi Shaw: యువ క్రికెటర్ పృథ్వీ షా–ఆకృతి అగర్వాల్ సంచలన నిర్ణయం.. పెళ్లికి ముందే బ్రేకప్..
-
Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ పాదయాత్రపై కోమటిరెడ్డి సెటైర్లు..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!