కేసీఆర్‌కు ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేల లేఖ.. కక్ష వద్దు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు లేఖరాశారు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు.. వెలిగొండ ప్రాజెక్టు విషయంలో పునర్ సమీక్ష చేయాలని లేఖలో కోరారు.. వెలిగొండ ప్రాజెక్టుకు అనుమతులు లేవని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు భావిస్తోందని లేఖలో ప్రశ్నించిన టీడీపీ ఎమ్మెల్యేలు.. కేంద్ర ప్రభుత్వానికి, కృష్ణా నది యాజమాన్య బోర్డుకు.. తెలంగాణ సర్కార్ రాసిన లేఖలు వెనక్కి తీసుకోవాలని కోరారు.. అయితే, గెజిట్‌లో వెలిగొండ ప్రాజెక్టు పేరు లేకపోవడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యమని మండిపడ్డ టీడీపీ ఎమ్మెల్యేలు.. 2014 పునర్ విభజన చట్టం ప్రకారం అనుమతి ఇచ్చిన ప్రాజెక్టుల్లో వెలిగొండ ఉందని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వ వైఫల్యాలకు తోడు.. తెలంగాణ ఫిర్యాదుల వల్ల కరువు జిల్లా అయిన ప్రకాశం జిల్లాకు తీవ్ర నష్టం కలుగుతోందని లేఖలో పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు అనుమతి లేదంటున్న తెలంగాణ.. నెట్టంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులపై ఏం చెబుతుందని ప్రశ్నించారు. కరువు జిల్లాపై కక్ష వద్దని లేఖలో కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు టీడీపీ ఎమ్మెల్యేలు. డోలా, ఏలూరి, గొట్టిపాటి.
Also Read
- Japan-Mangoes: అన్నదాతలకు జపాన్ షాక్.. సీజన్లో భారత మామిడిపండ్లపై నిషేధం
- Twisha Sharma: ట్విషా శర్మ రీ-పోస్ట్‌మార్టంలో షాకింగ్ ట్విస్ట్.. అత్త గిరిబాల సింగ్ అరెస్ట్
- Siddaramaiah: కర్ణాటకలో పవర్ ఛేంజ్.. ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా
- CM Vijay: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో విజయ్ భేటీ.. తమిళనాడు అంశాలపై చర్చ
తాజావార్తలు
-
Nara Lokesh : మహిళలకు రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు..
-
Japan-Mangoes: అన్నదాతలకు జపాన్ షాక్.. సీజన్లో భారత మామిడిపండ్లపై నిషేధం
-
Mercury transit 2026: మే 29న అరుదైన “సరస్వతి యోగం”.. ఈ 6 రాశుల వారికి అదృష్టమే అదృష్టం
-
Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఎగ్జిట్.. హైకమాండ్ ఫోర్స్ చేసిందా? ఆయనే లొంగిపోయారా?
-
Twisha Sharma: ట్విషా శర్మ రీ-పోస్ట్‌మార్టంలో షాకింగ్ ట్విస్ట్.. అత్త గిరిబాల సింగ్ అరెస్ట్
ట్రెండింగ్
-
భారత్‌లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్‌తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్‌ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!