మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవుల కోసం తాము ముఖ్యమంత్రి జగన్ చుట్టూ తిరగడం లేదన్నారు. నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వరు కదా అన్నారు. బాబులా పదవుల కోసం స్వంతమామకు వెన్నుపోటు పొడిచారన్నారు. మేం పార్టీకోసం పనిచేస్తాం అన్నారు. కేబినెట్లో తమను తీసేశారంటే.. నా మనుషులు.. వీరిని తీసినా ఏం ప్రాబ్లం వుండదని భావించారన్నారు. సింపతీ కబుర్లకు ప్రలోభాలకు గురికావద్దన్నారు కొడాలి నాని. ఆయన వెంట సైనికుడిలా నిలబడతాం. జగన్ నిర్ణయం వెనుక…
గ్రామాల్లో కరెంట్ పీకుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను.. సీఎం పదవి నుంచి పీకేందుకు జనం సిద్ధంగా ఉన్నారంటూ వార్నింగ్ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. తెలుగుదేశం పిలుపునిచ్చిన బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు.. బాదుడే బాదుడు ఆందోళనల్లో భాగంగా త్వరలో క్షేత్రస్థాయిలో ఆందోళనలు చేపట్టబోతున్నారు చంద్రబాబు, లోకేష్.. క్షేత్రస్థాయికి వెళ్లని నేతలను మార్చేందుకు కూడా వెనుకాడేది లేదని ఈ సందర్భంగా స్పష్టం చేసిన చంద్రబాబు.. ఎవరినీ ఉపేక్షించాల్సిన అవసరం లేదని కార్యక్రమంపై జరిపిన…
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ మధ్య దూకుడు పెంచారు.. ఓవైపు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై దృష్టిసారించిన ఆయన.. పాత మంత్రుల్లో ఎవరికి అవకాశం ఇవ్వాలి.. ఎవ్వరికి పార్టీ బాధ్యతలు అప్పగించాలి.. కొత్తవారు ఎవరైనా మంత్రులుగా బెటర్, సామాజిక సమీకరణలతో ఎవరికి అవకాశం ఇస్తే బాగుంటుంది అనే విషయాలపై కసరత్తు చేస్తున్నారు.. మరోవైపు ప్రత్యర్థులపై పదునైన మాటలతో విరుచుకుపడుతున్నారు. గత రెండ్రోజులు నుంచి బహిరంగ సభల్లో విమర్శల ధోరణి మార్చారు. హస్తిన పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత విపక్ష…
గత బుధవారం పల్నాడు జిల్లా కేంద్రంలోని నరసరావుపేటలో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో వైసీపీ నేతలు సీఎం జగన్‌కు స్వాగతం పలుకుతు ఓ హస్పిటల్‌పై ఫ్లెక్సీలు కట్టారు. అయితే స్వాగతం పలుకుతూ కట్టిన ఫ్లెక్సీని టీడీపీ ఇన్ ఛార్జ్ చదలవాడ అరవిందబాబు తమ్ముడు హాస్పిటల్ పై ఏర్పాటు చేయడంతో వివాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడకు చేరుకున్న ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి.. ఫ్లెక్సీ తొలగింపును తప్పు పట్టారు. అనుమతి తీసుకునే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినప్పటికీ ఫ్లెక్సీలను టీడీపీ…
మరోసారి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం జగన్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఇటీవల సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. విమర్శలు గుప్పించారు. ‘గల్లీ నుండి ఢిల్లీ వరకూ పనికిమాలినోడని తేలిపోయిన తరువాత ఫ్రస్టేషన్ కాకపోతే ఫన్ వస్తుందా?.. వెంట్రుక మహరాజ్.. ఈకల ఎంపరర్ జగన్ రెడ్డి గారూ మీ వెంట్రుకలు పీకే ఓపిక, తీరిక మాకు లేవు. మీ నవరంధ్ర పాలన నుంచి ప్రజలను ఎలా గట్టెక్కించాలనే ఆలోచనలతో…
విపక్షాలపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. పల్నాడు జిల్లా నరసరావుపేటలో గ్రామ, వార్డు వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ… చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఓ దొంగల ముఠా.. ఈ దొంగల ముఠా హైదరాబాద్‌లో ఉంటూ సర్కార్ పై తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.. వాళ్లంతా మనుషుల రూపంలో ఉన్న దెయ్యాలు అని పేర్కొన్న సీఎం జగన్.. గతంలో దోచుకుని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని…
ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలో పెరిగిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా టీడీపీ ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు యువత నేత దేవినేని చందు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చాక రోజుకో సమస్య సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ఉన్నంత కాలం విద్యుత్ చార్జీ పెంచలేదని, స్లాబ్ రేట్ 1.90 పైసలు పెంచి ప్రజలపై…
శుభకృత్ నామ ఉగాది సందర్భంగా సరికొత్త ఆశలతో కొత్త జిల్లాల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందుకు అనుగుణంగా కొత్త గెజిట్ రూపొందించింది. కొత్త జిల్లాల పాలనకు అనుగుణంగా కలెక్టర్లు, ఎస్పీలను నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలకు కలెక్టర్ల నియామకం జరిగింది. సత్యసాయి జిల్లా కలెక్టర్ గా బసంత్ కుమార్, అనంతపురం జిల్లా కలెక్టర్ గా నాగలక్ష్మి, విశాఖ జిల్లా కలెక్టర్ గా మల్లికార్జున, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా బాలాజీ రావుని నియమించారు. విజయనగరం…
సింహం సింగిల్‌గానే వస్తుంది.. పందులే గుంపులుగా వస్తాయంటూ విపక్షాలపై సెటైర్లు వేశారు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్.. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం మబుగాంలో సచివాలయాన్ని ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీడీపీ పొత్తు లేకుండా ఎన్నికల్లో గెలవగలదా? అని ప్రశ్నించారు.. తెలుగుదేశం పార్టీని సింగిల్‌గా పోటీచేయమని చెప్పండి.. చంద్రబాబు, లోకేష్, అచ్చెంనాయుడు.. తాము ఒంటరిగా పోటీచేస్తామని చెప్పమనండి అంటూ సవాల్ విసిరారు.. ఇక, వారు పొత్తు ఉండదని చెప్పలేరన్న ఆయన.. అంతా కలసి మాపై…