జి.కొత్తపల్లి వైసీపీ గ్రామ అధ్యక్షుడు గంజి ప్రసాద్ హత్య తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.. స్థానిక ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై గ్రామస్తులు దాడికి యత్నించారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.. హత్యకు గురైన గంజి ప్రసాద్ ఫ్యామిలీతో పాటు.. మరికొందరు ఎమ్మెల్యే తలారిపై ఆరోపణలు చేస్తున్నారు.. ఈ వ్యవహారంపై స్పందించిన టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. ఎమ్మెల్యే తలారి వెంకట్రావు సహకారంతోనే హత్య జరిగిందని కుటుంబ సభ్యులు, గ్రామస్థులూ చెబుతున్నారు.. మరి ఎమ్మెల్యే తలారి విషయంలో ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది..? అని ప్రశ్నించారు. ఎక్కడ చూసినా అరాచకాలు, మానభంగాలు, హత్యలు, ఆత్మహత్యలే జరుగుతున్నాయని అని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి శూన్యం.. అరాచకం ప్రబలిపోతుంది.. నిత్యం ఎక్కడో ఒక చోట ఏదోక అరాచకం జరుగుతూనే ఉందంటూ సర్కార్‌పై మండిపడ్డారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి.
Read Also: Katrina Kaif: బెడ్ పై అందాల ‘మల్లీశ్వరి’.. నవ్వుతో ఫిదా చేస్తుందే