Rajahmundry MP Margani Bharath Ram Made Comments on TDP. గత మూడేళ్లలో దేశ సగటు కంటే మిన్నగా ఏపీ రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగిందని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో సాధారణ పరిస్థితులు ఉన్నప్పటికీ ఏడాదికి సగటున రాష్ట్ర తలసరి ఆదాయం రూ.12,025 పెరిగిందని, కోవిడ్ సంక్షోభంలో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రూ.17,913 పెరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు వెన్నుపోటు పొడిచి…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు.. రూ. 48 వేల కోట్లు వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించిన ఆయన.. రూ. 48 వేల కోట్ల దుర్వినియోగంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు.. వైసీపీ అధికారంలోకి వచ్చాక అప్పులు – అవివీతి తప్ప మరేం జరగలేదన్న ఆయన.. ప్రభుత్వం చెప్పుకున్న స్థాయిలో సంక్షేమానికి పెద్దగా ఖర్చు పెడుతోందేంలేదన్నారు.. కోర్టుల తీర్పులపై సభలో చర్చలు…
తెలుగు జాతి గౌరవాన్ని ఢిల్లీలో వెలుగెత్తి చాటిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. 40 నలభై వసంతాల తెలుగుదేశం ఆవిర్భావ వేడుకల లోగోను ఆవిష్కరించారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. టీడీపీ 40 ఏళ్లు పూర్తి చేసుకుని 41వ ఏడాదిలోకి అడుగుపెట్టబోతోంది. తెలుగుజాతి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు.. తెలుగు వారికి గుర్తింపు లేనప్పుడు టీడీపీ ఆవిర్భవించింది. రూ. 2కే కిలో బియ్యం ద్వారా ఆహార భద్రత, పక్కా ఇళ్ల నిర్మాణం ద్వారా పేదలకు ఇళ్లు ఇచ్చారు. ఇప్పుడు ఆ పథకాలే…
సీఎం వైఎస్ జగన్ ఎంత త్వరగా విశాఖ వెళ్లి కూర్చొంటే మాకు మరిన్ని సీట్లు పెరుగుతాయన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్.. ఇప్పటికే విశాఖలో అరాచకం.. భూకబ్జాలు పెరిగాయి.. సీఎం వెళ్తే మరింతగా పెరుగుతాయని.. విజయసాయి దెబ్బకు ఇప్పుడు విశాఖలో అందరూ భయపడుతున్నారు.. రేపు సీఎం వెళ్తే ఆయనకు భయపడతారని మీడియా చిట్చాట్లో పేర్కొన్నారు.. 1200 గజాల భూమి ఉన్న ప్రతి విశాఖ వాసి గజగజలాడుతున్నాడన్న లోకేష్… పరిపాలనా కేంద్రీకరణ.. అభివృద్ధి వికేంద్రీకరణతోనే…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోనే కాదు.. మండలిలోనూ సస్పెన్షన్ల పర్వం కొనసాగుతూనే ఉంది.. మద్యం ఎపిసోడుపై వరుసగా ఎనిమిదో రోజూ టీడీపీ ఎమ్మెల్సీల నిరసన వ్యక్తం చేశారు.. మద్య నిషేధంపై మహిళలకు జగన్ ఇచ్చిన హామీ గోవిందా గోవిందా అంటూ ఎమ్మెల్సీల నినాదాలు చేశారు.. 42 మంది మరణాలపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ శాసన మండలి వరకు నిరసనగా ర్యాలీ చేపట్టిన ఎమ్మెల్సీలు.. మృతుల ఫోటోలకు నివాళులర్పిస్తూ నల్ల కండువాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు.. కల్తీ సారా బాధిత…
పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ.. పెగాసెస్ వ్యవహారంపై చేసిన కామెంట్లు ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ హీట్ పుట్టించాయి.. ఇప్పటికే ఈ వ్యవహారంలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. అయితే, ఏపీ అసెంబ్లీలోనూ పెగాసెస్ ప్రస్తావన వచ్చింది… చంద్రబాబు పెగాసెస్ స్పై వేర్ను వినియోగించారన్న మమతా బెనర్జీ కామెంట్లపై చర్చకు సిద్ధమైంది అధికార వైసీపీ.. అయితే, పెగాసెస్ పై చర్చకు నోటీసివ్వాలన్న స్పీకర్ తమ్మినేని సూచించగా… ఇప్పటికే నోటీసు ఇచ్చినట్టు చీఫ్ విప్…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొనడం.. టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయడం నిత్యం జరుగుతోంది.. ఇక, ఇవాళ కూడా జంగారెడ్డిగూడెం మరణాల అంశంపై సభలో చర్చకు పట్టుపట్టారు ప్రతిపక్ష సభ్యులు.. స్పీకర్ పోడియం వద్ద బైఠాయించి నినాదాలు చేశారు.. జంగారెడ్డి గూడెం మరణాలపై జుడీషియల్ విచారణకు డిమాండ్ చేశారు.. అయిలే, మార్షల్స్ సహకారంతో సభ్యులు తమ తమ స్థానాల్లోకి వెళ్లేటట్లు చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం.. కానీ, బల్లలు చేరుస్తూ సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఆందోళనల మధ్య కొనసాగుతూనే ఉన్నాయి.. ప్రతీ రోజు శాసన సభలో టీడీపీ సభ్యులు ఆందోళన చేయడం… వారిని సభ నుంచి సస్పెండ్ చేయడం నిత్యం కొనసాగుతోంది.. అయితే, ఈ మధ్య త్వరలోనే తెలుగు దేశం పార్టీ బండారం బయట పెడతా? అంటూ అసెంబ్లీలో ప్రకటించారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. ఇక, ఇవాళ ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఇవాళే టీడీపీ బండారం బయటపెడతానని ప్రకటించారు.. ఎన్టీఆర్ తీసుకుని వచ్చిన మద్యపాన నిషేదాన్ని…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఇవాళ కీలక బిల్లులకు ఆమోదం తెలపనున్నారు.. మూడు రోజుల గ్యాప్ అనంతరం ఇవాళ ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి ఏపీ అసెంబ్లీ సమావేశాలు… ప్రశ్నోత్తరాలు, దేవదాయ, ఎక్సైజ్ శాఖలకు చెందిన బిల్లులను ఆమోదించనుంది సభ.. అసెంబ్లీలో వివిధ పద్ధులపై చర్చించి ఆమోదం తెలపనున్నారు.. ఇక, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టు ప్రగతిపై స్వల్ప కాలిక చర్చ సాగనుంది.. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో చర్చకు వచ్చే అంశాల విషయానికి వస్తే.. సీఎంఆర్ఎఫ్, మత్స్యకారులకు…