2 Crore Tax Notice: రూ.6,000 సంపాదించే వ్యక్తికి రూ. 2 కోట్ల ట్యాక్స్ నోటీస్ జారీ.. ఈ తప్పు చేస్తే మీకు కూడా..!
- రూ.6,000 సంపాదించే వ్యక్తికి రూ. 2 కోట్ల ట్యాక్స్ నోటీస్
- ఓం ప్రకాష్ పాన్ కార్డును ఎవరో దుర్వినియోగం
- ఓం ప్రకాష్ కు రూ.1,99,42,313 పన్ను చెల్లించాలని డిమాండ్ చేస్తూ GST శాఖ నుండి నోటీసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆదాయ పన్ను శాఖ జారీ చేసిన ట్యాక్స్ నోటీస్ ఓ వ్యక్తికి ముచ్చెమటలు పట్టించింది. ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థ్‌నగర్ జిల్లా దుమారియాగంజ్ తహసీల్ ప్రాంతానికి చెందిన ఒక యువకుడికి సుమారు రూ.2 కోట్ల పన్ను చెల్లించాలని డిమాండ్ చేస్తూ GST శాఖ నోటీసు జారీ చేసింది. నోటీసులతో బాధితుడు ఓం ప్రకాష్ వర్మ షాక్ అయ్యాడు. రూ.6,000 సంపాదించే వ్యక్తికి కోట్ల రూపాయల ట్యాక్స్ నోటీస్ జారీ చేయడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Also Read:Ambati Rambabu: అంబటి రాంబాబు, జక్కంపూడి రాజాకు పోలీసుల షాక్..
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Biscuit Recipe: ఓవెన్ అవసరం లేదు.. కడాయితోనే బేకరీ స్టైల్ బిస్కెట్లు ఇంట్లోనే.. తయారీ విధానం చాలా ఈజీ!
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
దుమారియాగంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని భార్వతియా ముస్తాఖం గ్రామానికి చెందిన ఓం ప్రకాష్ కు రూ.1,99,42,313 పన్ను చెల్లించాలని డిమాండ్ చేస్తూ GST శాఖ నుండి నోటీసు అందింది. ఈ నోటీసు ఫిబ్రవరి 10న పోస్ట్ ద్వారా అందింది. ఆ నోటీసు చదివి ఓం ప్రకాష్ షాక్ అయ్యాడు. ఓం ప్రకాష్ వర్మ ప్రైవేట్ టీచర్, నెలకు ఆరు నుండి ఏడు వేల రూపాయలు సంపాదిస్తాడు. నోటీసులు అందిన వెంటనే ఓం ప్రకాష్ దుమారియాగంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
అమ్మకపు పన్ను శాఖ ప్రధాన కార్యాలయంలో విచారించిన తర్వాత, ఓం ప్రకాష్ పాన్ కార్డును ఎవరో దుర్వినియోగం చేసి న్యూఢిల్లీ, ఫరూఖాబాద్‌లలో ప్రత్యేక సంస్థలను సృష్టించారని తేలింది. ఈ సంస్థల ద్వారా లావాదేవీలు జరిగాయి. న్యూఢిల్లీలో ఉన్న ఓం ట్రేడర్స్ గత సంవత్సరం మొత్తం రూ.11,07,90,628 లావాదేవీలను ప్రాసెస్ చేసింది, దీని కోసం బాధితుడికి రూ.1,99,42,313 పన్నులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మెయిల్ ద్వారా నోటీసు అందింది.
బాధితుడు మాట్లాడుతూ.. నా దగ్గర పాన్ కార్డ్ ఎవరో దుర్వినియోగం చేసి రెండు సంస్థలను సృష్టించారు. ఒకటి ఢిల్లీలో ఓం ట్రేడర్స్ పేరుతో రిజిస్టర్ చేయబడింది. మరొకటి వర్మ ఎంటర్‌ప్రైజెస్ పేరుతో ఫరూఖాబాద్‌లో రిజిస్టర్ చేశారు. నాకు ఫిబ్రవరి 10న నోటీసు అందింది. ఆ నోటీసులో రూ.2 కోట్లు చెల్లించాలని ఉంది. నేను పేదవాడిని. నాకు భయంగా ఉంది. సమస్య పరిష్కారం కోసం పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ టాక్సెస్ అది నా పేరు మీద రిజిస్టర్ అయిందని నాకు చెప్పారు. సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరినట్లు తెలిపారు. పాన్ కార్డ్ హోల్డర్స్ అప్రమత్తంగా ఉండాలని, తమ కార్డు దుర్వినియోగం అయ్యిందా లేదా అన్నది ఆన్ లైన్ లో చెక్ చేసుకోవాలని అధికారులు తెలిపారు.
Also Read:Astrology: ఫిబ్రవరి 21, శనివారం దినఫలాలు..
పాన్, ఆధార్ వివరాలు చాలా సందర్భాల్లో వినియోగించాల్సి వస్తుంది. అందువల్ల, వీటి విషయంలో అప్రమత్తంగా ఉండడం ముఖ్యం.
ఎవరికి పడితే వారికి వాట్సాప్‌లో ఫార్వర్డ్ చేయొద్దు. అనధికారిక వెబ్‌సైట్లలో పాన్ వివరాలను అప్‌లోడ్ చేయడం, అనుమానాస్పద రిటైలర్లకు ఇవ్వడం వంటివి చేయకండి.
మీ పాన్‌కార్డు పోయినట్లయితే వెంటనే డూప్లికేట్ కోసం దరఖాస్తు చేసుకోండి. కొన్ని నెలల పాటు ఆ కార్డు దుర్వినియోగం అయ్యిందేమో రివ్యూ చేసుకోండి.
బ్యాంకింగ్ యాప్‌లకు, లోన్ అప్లికేషన్లకు బలమైన పాస్‌వర్డ్‌లు పెట్టండి. 2-ఫ్యాక్టర్ అథంటికేషన్, ఎస్సెమ్మెస్/ఇ-మెయిల్ నోటిఫికేషన్‌లను ఆన్‌లో పెట్టుకోండి.
మీ పేరు మీద లోన్ లేకపోయినా మీ పాన్ నంబర్ దుర్వినియోగానికి గురై ఉండే అవకాశం ఉంటుంది. క్రెడిట్ రిపోర్టులో ‘హార్డ్ ఎంక్వైరీ’లు ఉన్నాయోమో చూడండి. అనుమానాస్పద సంస్థల నుంచి వచ్చిన ఎంక్వైరీలు కనిపిస్తే వెంటనే ఆ బ్యూరోకు ఫిర్యాదు చేయాలి.
తాజావార్తలు
-
Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల ‘ఫ్యాన్స్ మీట్’ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
-
Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
-
Biscuit Recipe: ఓవెన్ అవసరం లేదు.. కడాయితోనే బేకరీ స్టైల్ బిస్కెట్లు ఇంట్లోనే.. తయారీ విధానం చాలా ఈజీ!
-
Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?