మంత్రి గుడివాడ అమర్నాథ్ జనసేన అధినేత పవన్ ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు డైరెక్షన్లో మూడు నెలలుగా బ్రహ్మాండమైన సినిమా నడుపుతున్నారు…. అది అట్టర్ ఫ్లాప్ అయిపోవడం ఖాయం అన్నారు. రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు లేదన్నారు అమర్నాథ్. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులను రాష్ట్ర ప్రభుత్వం అడుకుంటోంది. రైతులను మోసం చేసింది చంద్రబాబు అనేది దత్తపుత్రుడు తెలుసుకోవాలి. 2014లో చంద్రబాబు అధికారంలోకి రావడానికి అనుసరించిన మోసపూరిత హామీలే కౌలు…
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో సామూహిక అత్యాచార బాధితురాలి పరామర్శ ఇప్పుడు పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది.. పరామర్శ సమయంలో.. టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మధ్య జరిగిన వాగ్వాదం రచ్చగా మారింది.. అయితే, ఈ ఘటనపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ.. బాధితురాలి దగ్గర టీడీపీ నేతలు బల ప్రదర్శన చేశారని ఎద్దేవా చేసిన ఆమె.. గొడవను కంట్రోల్ చేయమని అడిగితే నాపై విరుచుకుపడ్డారని…
శాప్ ఛైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బైరెడ్డి సిద్దార్థరెడ్డికి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియతో పాటు మీడియాను షేక్ చేస్తోంది.. నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్థర్‌తో బైరెడ్డికి విభేదాలు బహిరంగ రహస్యమే కాగా.. ఈ మధ్య ఓ పరిణామం చర్చకు దారితీసింది.. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు బైరెడ్డి సిద్ధం అవుతున్నారని.. అందులో భాగంగానే ఈ మధ్యే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో భేటీ అయ్యారనే వార్తలు గుప్పుమన్నాయి.. అంతేకాదు.. టీడీపీలో చేరి…
టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి మండిపడ్డారు ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. బిర్లా-సీఎం వైఎస్ జగన్ ఇద్దరూ లంచ్ మీటింగ్ పెట్టుకున్నారని తెలిస్తే చంద్రబాబుకి గుండె అగిపొద్దేమో అని సెటైర్లు వేశారు.. ఆదిత్యా గ్రూప్ కంపెనీ రాష్ట్రానికి రావడం శుభపరిణామంగా అభివర్ణించిన ఆయన.. రూ. 2500 కోట్ల పెట్టుబడులతో 2500 మందికి ఉపాధి రాబోతుందన్నారు.. కానీ, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే చంద్రబాబుకి కడుపు మండుతుందని.. చంద్రబాబు కడుపు మంట ఆయన మాటల్లో కనిపిస్తుందని.. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం,…
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… మతి భ్రమించిన చంద్రబాబు.. నోటికి అడ్డూ అదుపు లేకుండా మాట్లాడుతున్నారు.. అందుకే చంద్రబాబుకు తెలివి తేటలు, శక్తిసామర్థ్యాలు కావాలంట.. దుర్గమ్మవారిని అవే కోరుకున్నట్లు ఆయనే చెప్పారు.. మరి ఇన్నాళ్లూ అవి లేవా? ఉంటే వాటిని కోల్పోయారా..? అంటూ ఎద్దేవా చేశారు. మంచి మనసు, ఆలోచన ఉంటే అన్నీ బాగుంటాయి.. కానీ, చంద్రబాబుకు అవేవీ లేకుండా పోయాయన్న ఆయన.. చంద్రబాబు ఒక…
కర్నూలు జిల్లా ఆదోని ఒకప్పుడు టీడీపీకి బాగా పట్టున్న నియోజకవర్గం. ప్రస్తుతం ఆదోని టీడీపీ ఇంచార్జ్‌గా మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు కొనసాగుతున్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన 2014, 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ 42 వార్డులకు గాను.. టీడీపీకి దక్కింది ఒక్క వార్డే. 5 గ్రామ పంచాయతీలలోనే టీడీపీ మద్దతుదార్లు గెలిచారు. రెండు ఎంపీటీసీలు దక్కాయి. పరిస్థితి ఈ విధంగా దిగజారిపోయినా పార్టీ నేతలు వర్గపోరును విడిచిపెట్టడం లేదు. ఆదోనిలో టీడీపీ పరాజయానికి..…
నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్థర్, వైసీపీ ఇంఛార్జ్, శాప్ ఛైర్మన్‌గా ఉన్న బైరెడ్డి సిద్దార్థరెడ్డి మధ్య తారాస్థాయిలో విభేదాలు ఉన్న సంగతి బహిరంగ రహస్యమే. ఎన్ని విభేదాలు ఉన్నా ఇద్దరూ పార్టీ కార్యక్రమాలతోపాటు.. ప్రభుత్వ ప్రొగ్రామ్స్‌లో చురుకుగా పాల్గొనేవారు. అయితే నాలుగు నెలలుగా సిద్దార్థరెడ్డి వైఖరిలో మార్పు వచ్చిందని వైసీపీ కేడర్ చెవులు కొరుక్కుంటోందట. ఎందుకలా అనే దానిపై పార్టీ నేతలు ఆరా తీస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో సిద్దార్థరెడ్డి భేటీ…
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో తెలంగాణ టీడీపీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. సమావేశానికి టీటీడీపీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు, టీడీపీ వ్యవహారాల ఇంచార్జ్ కంభంపాటి రామ్మోహన్, పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. పార్టీ సంస్థాగత అభివృద్ధి, సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలతో పాటు మే లో హైదరాబాద్ లో జరిగే మినీ మహానాడు విజయవంతం చేయాలని పార్టీ నేతలకు…
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పలు సందర్భాల్లో తీవ్ర విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి, వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్.. మరోసారి జనసేనానిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయలేని పవన్ కల్యాణ్… భీమ్లా నాయక్ కాదని తెలుగుదేశం పార్టీ వద్ద బిచ్చం అడుక్కునే బిచ్చ నాయక్ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. Read Also: VH: మళ్లీ సొంత పార్టీ నేతలను టార్గెట్ చేసిన వీహెచ్.. చెప్పినా పట్టించుకోరా..? పవన్…