జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు ( సోమవారం ) మచిలీపట్నంలో వారాహి యాత్ర నిర్వహించనున్నారు. మచిలీపట్నంలో మహాత్మాగాంధీకి పవన్ నివాళులర్పించనున్నారు. అనంతరం వారాహి యాత్రలో పాల్గొననున్నారు. ఇందులో భాగంగానే.. కృష్ణాజిల్లా కార్యవర్గంతో సమావేశం కానున్న జనసేన అధినేత.. అనంతరం సభలో ఎలాంటి విషయాలను మాట్లాడాలనే దానిపై ప్రధానంగా చర్చించనున్నారు.
Read Also: 2BHK Houses: నేడే డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ.. ఎవరెవరు ఎక్కడంటే..
కాగా, వారాహి యాత్ర నాలుగో దశ మొదటి రోజు అవనిగడ్డలో నిర్వహించిన బహిరంగ సభలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేనతో పాటు టీడీపీ శ్రేణులు సైతం వారాహి యాత్రకు కదలొచ్చారు. రెండు పార్టీల జెండాలతో సందడి వాతావరణం కనిపించింది. ప్రత్యేక పరిస్థితుల్లో సపోర్టుగా నిలబడ్డ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు అంటూ పవన్ కళ్యాణ్ ప్రసంగం ప్రారంభించారు.
Read Also: Bandaru satyanrayana: అనకాపల్లిలో ఉద్రిక్తత.. బండారు సత్యనారాయణమూర్తి ఇంటి చుట్టు పోలీసులు
వారాహి విజయయాత్రలో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లా అవనిగడ్డలో భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్తు దృష్ట్యా ఈసారి ఓటు చీలనివ్వకూడదు.. వైసీపీ ప్రభుత్వాన్ని దించేయడమే మా లక్ష్యం అని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి జనసేన-టీడీపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో నేను గెలిచుంటే నేడు డీఎస్సీ అభ్యర్థులు ఇలా ప్లకార్డులు పట్టుకుని నిలుచోవాల్సిన అవసరం వచ్చేది కాదు అని పవన్ అన్నారు. సీఎం జగన్ లాంటి వేల కోట్ల రూపాయలు దోచేసిన తర్వాత కూడా ఇంకా దోచుకుంటూనే ఉన్నాడన్నాడని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.