జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ఏపీలో రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. టీడీపీతో పొత్తు వద్దనే అభిప్రాయంతో బిజేపి కేంద్ర నాయకత్వం. పవన్ కల్యాణ్ ను ఢిల్లీకి రమ్మనమని ఎవరూ పిలవలేదని అంటున్నారు బీజేపి వర్గాలు. పవన్ కల్యాణ్ స్వయంగా చొరవ తీసుకుని పొత్తు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్న బిజేపి వర్గాలు. అయితే, టిడిపి తో పొత్తుకు మాత్రం బిజేపి విముఖంగా ఉన్నట్లు సమాచారం. టిడిపి “స్నేహం” పట్ల అపనమ్మకంతో ఉన్న బిజేపి. ఇటీవల ఏపీలో జరిగిన ఉపాధ్యాయుల ఎమ్.ఎల్.సి ఎన్నికల్లో “పిడిఎఫ్” ( ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్) తో టిడిపి పొత్తు పెట్టుకోవడం సుతారం ఇష్టం లేని బిజేపి.
Read Also:Telangana Railway: తెలంగాణ రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి సమాధానం.. ఏమన్నారంటే?
జనసేన తో కలిసి పనిచేసేందుకు మాత్రమే సుముఖంగా ఉన్న బిజేపి. సాయంత్రం తర్వాత ఏపి బిజేపి వ్యవహారాల ఇంచార్జ్, కేంద్ర మంత్రి మురళీధరన్ తో “జనసేన” నేత పవన్ కళ్యణ్, నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. బిజేపి అగ్రనేతలతో పవన్ కల్యాణ్ భేటీలపై ఇంకా అస్పష్టత కొనసాగుతోంది. బిజేపి అగ్రనేతలకు ఏపి బిజేపి వ్యవహారాల ఇంచార్జ్ మురళీధరన్ ఇచ్చే చర్చలు వివరాలను బట్టి తదుపరి భేటీలు ఉంటాయని భావిస్తున్నారు.ఇదిలా ఉండగా బీజేపీ ఏపీ ఇన్ ఛార్జి మురళీధరన్ తో పవన్ భేటీ అయ్యారు.
Read Also: Today Stock Market Roundup 03-04-23: వారంలో 11% పెరిగి 52 వారాల గరిష్టానికి ‘మణప్పురం’