Gudivada Amarnath: పవన్ కళ్యాణ్‌కి కౌంటర్.. చెప్పులు మా దగ్గర లేవా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Amarnath Counter To Pawan Kalyan Comments: చెప్పుతో కొడతానంటూ జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ‘మా దగ్గర చెప్పులు లేవా?’ అంటూ ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. ఫ్రస్ట్రేషన్ ఎక్కువై పవన్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని అన్నారు. ‘చెప్పుతో కొడతాడా? చెప్పులు మా దగ్గర లేవా? పళ్ళు వాళ్ళకు లేవా?’ అంటూ రివర్స్ ఎటాక్ చేశారు. ప్రజాస్వామ్యంలో చెప్పుతో కొట్టడం, పళ్ళు రాలగొట్టడం అంటే.. పవన్ కళ్యాణ్‌కు భీమవరంలో, గాజువాకలో జరగటం లాంటిదని సెటైర్లు వేశారు. మొన్న ఎన్నికల్లో 6 శాతం ఓట్లు వచ్చిన పవన్ దగ్గర చెప్పులు, పళ్ళు ఉంటే.. 50 శాతం ఓట్లు వచ్చిన మా దగ్గర ఎన్ని ఉండాలి? అని ప్రశ్నించారు. మూడు పెళ్ళిళ్ళే పవన్ కళ్యాణ్ విధానమని విమర్శించారు. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ సింహం, పులి అని అనుకున్నారని.. ఇవాళ పిచ్చి కుక్క అని తేలిపోయిందని ఎద్దేవా చేశారు.
పీకే అంటే ప్యాకేజీ కళ్యాణ్, పీకే అంటే పెళ్ళిళ్ళ కళ్యాణ్, పీకే అంటే పిచ్చి కుక్క అని తాను ఇప్పటికీ అంటానని.. ఏం చేస్తాడో రమ్మనండని అమర్నాథ్ సవాల్ విసిరారు. తామంతా సమాజంలో ఉన్నామని, అడవిలో లేమని.. వచ్చి ఎవరిని కొట్టేస్తావ్ అంటూ నిలదీశారు. చిరంజీవి లేకపోతే నువ్వెక్కడ ఉండేవాడివని సూటి ప్రశ్న సంధించారు. టీడీపీకి ఊడిగం చేస్తున్నావని.. రంగా మరణానికి కారణమైన టీడీపీతో ఎలా పొత్తు పెట్టుకున్నావని పవన్‌ని ప్రశ్నించారు. ఒకసారి యుద్ధంలో ప్రజలు ఏం సమాధానం ఇచ్చారో చూశామని.. మళ్లీ యుద్ధానికి రమ్మనండని ఛాలెంజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్ ఇంటి అడ్రస్ ఎక్కడో చెప్పమని డిమాండ్ చేశారు. రాష్ట్రం గురించి అవసరం లేదు.. వాళ్ళ పార్టీకి చెందిన ఒక 70 పేర్లు చెప్తే.. పవన్ ఏం చెప్తే అది చేయడానికి సిద్ధమని అన్నారు. ఆడ పిల్లలను గౌరవించే సంస్కారం పవన్‌కి లేదన్నారు. మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న నీకు మూడు వేల స్టెఫినీలు ఉన్నారా? అని ప్రశ్నించారు.
Also Read
- AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
తాజావార్తలు
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!