2024లో జరిగే ఏపీ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలకు మరో 2 నెలల్లో ఎన్నికలు రాబోతున్న వేళ నంద్యాల జిల్లా బనగానపల్లెలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి దూకుడు పెంచారు. తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు బాబు ష్యూరిటీ – భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో బాగంగా బనగానపల్లె నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తున్న జనార్థన్ రెడ్డికి గ్రామ గ్రామానా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.
Read Also: Devil : ఓటీటీలోకి వచ్చేస్తున్న కళ్యాణ్ రామ్ ‘డెవిల్’..స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
తాజాగా కొలిమిగుండ్లలో పర్యటించిన బీసీజేఆర్‌కు స్థానిక టీడీపీ- జనసేన నాయకులు, కార్యకర్తలు, బీసీ అభిమానులతో పాటు కొలిమిగుండ్ల ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొలిమిగుండ్లలో ఇంటి ఇంటికి వెళ్లిన బీసీ జనార్థన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాల గురించి ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. కొలిమిగుండ్ల పర్యటిస్తున్న సందర్భంగా గత నెల రోజులుగా నిరవధిక ధర్నా చేస్తున్న అంగన్వాడీ మహిళలకు ఆయన సంఘీభావం తెలిపారు. తక్షణమే అంగన్వాడీల న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇక, బీసీ జనార్థన్ రెడ్డి రాక సందర్భంగా కొలిమిగుండ్లలో అధికార వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తీరు నచ్చక స్థానిక 5 వార్డు మెంబర్ రాముతో పాటు పలువురు వైసీపీ నాయకులు తమ కుటుంబాలతో సహా మాజీ ఎమ్మెల్యే టీడీపీ కండువా కప్పుకున్నారు. ఎన్నికల వేళ.. టీడీపీ అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డికి దక్కుతున్న ప్రజాదరణతో, వైసీపీ నుంచి వరుసగా చేరికలతో టీడీపీ క్యాడర్‌లో ఫుల్ జోష్ నెలకొంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బనగానపల్లెలో టీడీపీ జెండా ఎగరడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.