Visakhapatnam: విశాఖపట్నంలోని పోలిపల్లిలో టీడీజీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర యువగళం ముగింపు బహిరంగ సభలో టీడీపీ- జనసేన పార్టీలు ఉమ్మడిగా ఎన్నికల శంఖారావం పురిస్తామని ఆంధ్ర ప్రదేశ్ తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ సభ వేదికపై టీడీజీ జాతీయ అధినేత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరవుతారు అని ఆయన పేర్కొన్నారు.
Read Also: Hanuman: శ్రీరాముని ఆశీస్సులు కూడా అందాయి… ఇక ట్రైలర్ రావడమే లేట్
ఇక, తెలుగుదేశం పార్టీలో గతంలో ఎన్నడూ జరగ లేనంత భారీ ఎత్తున ఈ బహిరంగ సభ ఏర్పాటు చేశామని అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఏయూలో బహిరంగ సభకు అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డుకుంది అని విమర్శలు గుప్పించారు. ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సులు ఇవ్వకుండా జగన్ సర్కార్ అడ్డంకులు సృష్టిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అడ్డుకున్న కానీ, ఆరు ప్రత్యేక రైళ్లు రాయలసీమ నుంచి వస్తున్నాయి.. రెండున్నర లక్షల మంది పట్టే విధంగా సీటీంగ్ ఏర్పాట్లు చేశాము.. జనసేన, టీడీపీలు కలిసికట్టుగా ఏ విధంగా పని చేస్తున్నాయనేది ఒక మెస్సేజ్ ఇస్తాం.. ఉత్తరాంధ్ర తర్వాత మరో మూడు బహిరంగ సభలు జరుగుతాయన్నారు. అయితే, టీడీపీ- జనసేన రెండో బహిరంగ సభలో మేనిఫెస్టో ప్రకటన విడుదల చేస్తామని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు వెల్లడించారు.