భీమిలిలో సిద్దం సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కటౌట్స్ ఏర్పాటు చేశారు అని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. పంచింగ్ బ్యాగ్స్ ఏర్పాటు చేసి పైశాచిక ఆనందం సీఎం జగన్ పొందుతున్నారు.. పరిపాలన వదిలి ప్రజలను రెచ్చ గొట్టే పని చేస్తున్నారు.. జగన్ సిద్దం సభను నాన్ సీరియస్ గా చేశారు.. వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపటానికి ప్రజలు సిద్ధమయ్యారు అని ఆయన చెప్పుకొచ్చారు. సంస్కారం లేని వ్యక్తిగా జగన్ మారిపోయారు.. ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేసిన సభల్లో రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారు.. రూ. 91,253 కోట్లకు లెక్కలు లేవు.. ఈ డబ్బు ఎక్కడికి వెళ్ళింది ఏమైంది కూడా తెలియదు.. ఇలాంటి ప్రభుత్వం ఎక్కడ ఉండదు అని నాదేండ్ల మనోహర్ అన్నారు.
Read Also: Kota: “మమ్మీ, డాడీ, ఈ జేఈఈ నావల్ల కాదు”.. కోటాలో మరో ఆత్మహత్య..
ప్రభుత్వ లెక్కలపై చర్చకు జనసేన సిద్దం అని నాదేండ్ల మనోహర్ తెలిపారు. బెజవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో సిద్దం అంటూ సవాల్ చేశారు. సంస్కారం లేకుండా ప్రతిపక్షాలపై మాటల దాడులు సరికాదు.. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ఈ చర్చకు రావాలని సీఎంను కోరుతున్నాం.. ఏపీ ప్రభుత్వాన్ని కొన్ని సంస్థలు బ్యాన్ చేశాయి.. చివరి అసెంబ్లీ సమావేశాలు కాబట్టి లెక్కల్లో కనపడని డబ్బుపై సమగ్ర విచారణ చేపట్టాలి అని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, జనసేన – టీడీపీ సీట్లపై సైతం నాదెండ్ల స్పందించారు. చంద్రబాబు- పవన్ కలిసి చర్చించి సీట్లపై ప్రకటన చేస్తారు.. త్వరలోనే సీట్ల ప్రకటన ఉంటుంది.. అన్ని రాజకీయ పార్టీల మాదిరిగానే మేం కూడా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తాం.. పవన్ ఢిల్లీ టూర్ పై నాకు సమాచారం లేదన్నారు. టీడీపీ పొత్తు ధర్మం పాటించాలి అని మాత్రమే పవన్ అన్నారు.. సీట్ల ప్రకటన విషయంలో మా పార్టీ నేతల మనోభావాల ప్రకారం పవన్ రియాక్ట్ అవుతారు.. జనసేన ఎన్డీయేలో భాగస్వామ్య పక్షంగా ఇప్పటికే ఉంది అని నాదేండ్ల మనోహర్ వెల్లడించారు.