Jallikattu Protest : తమిళనాడు రాష్ట్రం క్రిష్టగిరి జిల్లాలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. గోబాచంద్రలో జల్లికట్టు నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో యువకులు వీరంగం సృష్టిస్తున్నారు.
Helicopter carrying Sri Sri Ravi Shankar makes emergency landing: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, యోగా గురు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ కు ప్రమాదం తప్పింది. అతను ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. దట్టమైన పొగమంచు కారణంగా హెలికాప్టర్ ప్రయాణానికి ఇబ్బంది కావడంతో పైలెట్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. తమిళానాడు ఈరోజు జిల్లాలో ఈ ఘటన జరిగింది.
Telangana New Secretariat inauguration: తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొత్త సచివాలయం నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి.. నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు.. వేదపండితులు సూచించిన ముహూర్తం మేరకు, ఫిబ్రవరి 17వ తేదీన శుక్రవారం ఉదయం 11.30 నుంచి 12.30 గంటల నడుమ నిర్వహించనున్నట్టు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.…
Dog Dispute: తమిళనాడులో ఘోరం జరిగింది. కుక్కలకు ఉన్న విలువ మనుషులకు లేకుండా పోయింది. కుక్కను కుక్క అని పిలిచినందుకు వృద్ధుడిని కొట్టి చంపారు. సాధారణంగా పెంపుడు కుక్కల విషయంలో బంధువుల మధ్య మొదలైన గొడవ చిలికి చిలికి గాలివానై ఒకరి ప్రాణాలను బలి తీసుకుంది.
Love Today Scene Repeat: సినిమా స్టోరీలు నిజ జీవితంలో రిపీట్ అయిన సందర్భాలు ఎన్నో ఉంటాయి.. కొందరు సినిమాల్లోని సీన్లను ఫాలో అయిపోతుంటారు.. అవి కొన్ని సార్లు మంచి చేస్తే.. ఇంకా కొన్నిసార్లు గుట్టును విప్పి రచ్చ చేస్తాయి.. ఇక, ఈ మధ్యకాలంలో లవ్ టుడే సినిమా సంచలనమే సృష్టించింది.. ప్రేమికులు ఒకరి సెల్‌ఫోన్ ఒకరు మార్చుకుంటే ఏమవుతుందన్న కథ చుట్టే ఈ సినిమా తిరుగుతుంది.. పూర్తిగా ఒకరి గురించి ఒకరికి తెలుసు అనుకుంటున్న ప్రేమికుల…
Villagers attack on police: సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించే సంప్రదాయ క్రీడ జల్లికట్టు పోటీలు రక్తం చిందిస్తూనే ఉన్నాయి.. అపశృతులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.. ఈ ఏడాది కూడా ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.. తాజాగా, తిరుపత్తూరు జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. నాట్రపల్లిలో నిన్న నిర్వహించిన జల్లికట్టులో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.. ఆ తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.. అయితే, ఆ యువకుడు మృతికి పోలీసులే కారణం అంటూ…
Tamil Nadu: తమిళనాడులో జరిగిన ఓ యువకుడి ఆత్మహత్య ఇప్పుడు అందరి మనస్సులను కలచివేస్తోంది.. కట్టుకున్న భార్య కన్నుమూయడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆ యువకుడు.. ఓసారి ఆత్మహత్యకు యత్నించి.. ప్రాణాలతో బయటపడ్డాడు.. కానీ, ఆ తర్వాత మళ్లీ అదే ప్రయత్నం చేశాడు.. ఆత్మహత్య చేసుకున్నాడు.. తమిళనాడులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కడలూరు సమీపంలోని నిట్టమలై సెట్టి బస్‌స్టాప్‌లో గుణశేఖరన్ అనే యువకుడు నిన్న ఉదయం బస్సు టైర్ కింద తలపెట్టి ఆత్మహత్యాయత్నం చేశాడు..…
DMK Worker's Threat To Tamil Nadu Governor: తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి, డీఎంకే ప్రభుత్వం మధ్య వివాదం అలాగే కొనసాగుతోంది. డీఎంకే నేతలు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికే ‘గెట్ అవుట్ రవి’ అంటూ చెన్నైతో పాటు పలు ప్రాంతాల్లో పోస్టర్లను ఏర్పాటు చేశారు డీఎంకే పార్టీ నేతలు. ఇదిలా ఉంటే తాజాగా మరో డీఎంకే నేత బహిరంగంగానే గవర్నర్ రవిని బెదిరిస్తూ వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ వ్యాఖ్యలతో తమకు సంబంధం…
College Student Gang-Raped In Front Of Boyfriend In Tamil Nadu: తమిళనాడులో దారుణం జరిగింది. ప్రియుడి ఎదుటే ప్రియురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగుడు. కాంచీపురం జిల్లాలో ఈ ఘటన జరిగింది. యువకుడు, అమ్మాయి క్లాస్ మేట్స్. వీరిద్దరు ఏకాంతంగా గడిపేందుకు ఓ మారుమూల ప్రాంతానికి వెళ్లారు. ఇది గమనించిన దుండగులు యువకుడిని కొట్టి, కత్తితో బెదిరించి, 20 ఏళ్ల విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు.
Tamil Nadu BJP chief Annamalai to get Z-category security: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడికి కేంద్ర భారీ సెక్యూరిటీని కల్పించింది. ఏకంగా జెడ్-కేటగిరి భద్రతను కల్పించనుంది. అన్నామలై రక్షణగా మొత్తం 33 మంది సీఆర్పీఎఫ్ కమాండోలను నియమించనున్నారు. ఇంటెలిజెన్స్ నివేదిక తర్వాత కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అన్నామలైకి గతంలో వై-కేటగిరి సెక్యూరిటీ ఉంది. అయితే ఇటీవల కాలంలో తమిళనాడు రాజకీయాల్లో చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు అన్నామలై.