Khushbu Sundar: ప్రముఖ సినీనటి, బీజేపీ నేత ఖుష్బూ సుందర్ కు కీలక పదవి లభించింది. జాతీయ మహిళా కమిషన్( ఎన్సీడబ్ల్యూ) సభ్యురాలిగా ఆమెను కేంద్రం నామినేట్ చేసింది. ఆమెతో పాటు మరో ఇద్దరిని నామినేట్ అయ్యారు. బీజేపీ జాతీయ కార్యవర్గం సభ్యురాలు అయిన ఖుష్బూ తన నియామక పత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
AIADMK Leadership row: తమిళనాడు రాజకీయ పార్టీ ఏఐడీఎంకే పార్టీ చీఫ్ గా పళనిస్వామి ఉంటారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి ఉంటారని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. అన్నాడీఎంకే పార్టీపై తన అధిపత్యాన్ని నిలుపుకోవడానికి పన్నీర్ సెల్వం చేసిన ప్రయత్నాలకు బ్రేక్ వేసింది. మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఓ పన్నీర్ సెల్వం (ఓపీఎస్) వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
Tamil Nadu: జవాను హత్యపై తమిళనాడు రాజకీయం అట్టుడుకుతోంది. డీఎంకే సర్కారుపై బీజేపీ రగిలిపోతోంది. దేశాన్ని కాపాడే సైనికులకే తమిళనాడులో భద్రత కరువైందని విమర్శిస్తోంది. తమిళనాడు వ్యాప్తంగా నిరసనలు చేస్తోంది. అటు వీధి గొడవ కారణంగా జరిగిన హత్యను బీజేపీ రాజకీయం చేస్తోందని డీఎంకే సహా ఇతర పార్టీలు మండిపడుతున్నాయి. ఇప్పటికే హత్యకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారని వాదిస్తోంది డీఎంకే. అయితే, తమిళనాడు కృష్ణగిరిలో చిన్న గొడవ విషయంలో లాన్స్ నాయక్…
ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్తో సంబంధాలున్న అనుమానితులపై భారీ అణిచివేతలో భాగంగా ఈరోజు కర్ణాటక, తమిళనాడు, కేరళలోని దాదాపు 60 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దాడులు నిర్వహించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనపై విమర్శలు, ట్రోల్ చేశారు. తనను బాడీ షేమ్ చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగా ఉంటే నిప్పులా మారతారని హెచ్చరించారు.
CM MK Stalin: సివిల్ సర్వీస్ అభ్యర్థుల విన్నపాలను పరిగణనలోకి తీసుకొని, వాళ్లకు మరో అవకాశమివ్వాలని ప్రధాని మోడీకి తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ రాశారు. కరోనా పరిస్థితుల కారణంగా చాలా మంది అభ్యర్థులు పరీక్ష రాయలేకపోయారని, చివరి అవకాశాన్నీ కోల్పోయిన వారున్నారని అన్నారు. అలాంటి వాళ్ల అభ్యర్థనను స్వీకరించి వయోపరిమితిని పెంచుతూ మరో సారి పరీక్ష రాసేందుకు అనుమతించాలని కోరారు. చివరి అవకాశం కోల్పోయిన అభ్యర్థులందరికీ మరోసారి పరీక్ష నిర్వహించే అంశాన్ని పరిశీలించాలంటూ..పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ…
Jallikattu Protest : తమిళనాడు రాష్ట్రం క్రిష్టగిరి జిల్లాలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. గోబాచంద్రలో జల్లికట్టు నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో యువకులు వీరంగం సృష్టిస్తున్నారు.
Helicopter carrying Sri Sri Ravi Shankar makes emergency landing: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, యోగా గురు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ కు ప్రమాదం తప్పింది. అతను ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. దట్టమైన పొగమంచు కారణంగా హెలికాప్టర్ ప్రయాణానికి ఇబ్బంది కావడంతో పైలెట్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. తమిళానాడు ఈరోజు జిల్లాలో ఈ ఘటన జరిగింది.
Telangana New Secretariat inauguration: తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొత్త సచివాలయం నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి.. నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు.. వేదపండితులు సూచించిన ముహూర్తం మేరకు, ఫిబ్రవరి 17వ తేదీన శుక్రవారం ఉదయం 11.30 నుంచి 12.30 గంటల నడుమ నిర్వహించనున్నట్టు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.…
Dog Dispute: తమిళనాడులో ఘోరం జరిగింది. కుక్కలకు ఉన్న విలువ మనుషులకు లేకుండా పోయింది. కుక్కను కుక్క అని పిలిచినందుకు వృద్ధుడిని కొట్టి చంపారు. సాధారణంగా పెంపుడు కుక్కల విషయంలో బంధువుల మధ్య మొదలైన గొడవ చిలికి చిలికి గాలివానై ఒకరి ప్రాణాలను బలి తీసుకుంది.