CR Kesavan: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, భారత చివరి గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి ముని మనవడు సిఆర్ కేశవన్ శనివారం బిజెపిలో చేరారు. దక్షిణాదిలో మరింగా విస్తరించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే దక్షిణాదికి చెందిన ముఖ్యనేతలను పార్టీలో చేర్చుకుంటోంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న కేశవన్ బీజేపీలో చేరడం చర్చనీయాంశంగా మారింది. ఈ చేరికతో కాంగ్రెస్కు మరో షాక్ తగిలినట్లు అయింది. కేంద్ర మంత్రి వీకే సింగ్, బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి అనిల్ బలూనీ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.
Read Also: Errabelli Dayakar Rao: ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటాం.. మోడీని గద్దె దించుతాం..
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా కేంద్రీకృత విధానాలు, అవినీతి రహిత, సమ్మిళిత పాలన నచ్చే బీజేపీలో చేరినట్లు ఆయన వెల్లడించారు. మోదీ పాలనపై ప్రశంసలు కురిపించారు. మోదీ ప్రభుత్వం జాతీయ భద్రతకు ప్రాధాన్యత ఇచ్చిందని, భారతదేశ చరిత్ర, సంప్రదాయాలకు ప్రాధన్యత ఇస్తుందని ఇటీవల జరిగిన ‘ కాశీ- తమిళ సమాగం’ కార్యక్రమం గురించి ప్రస్తావించారు. కోవిడ్-19 మహమ్మారిని కేంద్రం అడ్డుకు్న తీరును కేశవన్ ప్రశంసించారు. భారత్ ప్రపంచ స్థాయికి చేరడానికి మోదీనే కారణం అని అన్నారు.
దేశానికి రాజగోపాలాచారి చేసిన కృషి గురించి కేశవన్ మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆయనను పక్కన పెట్టారని, ఒకే కుటుంబం తామే అన్ని చేశామని చెప్పేందుకు ప్రయత్నించిందని పరోక్షంగా నెహ్రూ-గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి విమర్శించారు. ప్రస్తుతం బీజేపీలో చేరిన కేశవన్ తమిళనాడులో ఆ పార్టీకి బలంగా మారుతారని అనుకుంటోంది. తమిళనాడులో అన్నామలై సారధ్యంలో బీజేపీ బలపడాలని ప్రయత్నిస్తోంది. గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత, కేరళకు చెందిన ఏకే అంటోని కొడుకు అనిల్ ఆంటోనిని బీజేపీలో చేరారు. నిన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు.