Chennai: అవినీతిని నిర్మూలించాల్సిన పోలీసులే అవినీతికి పాల్పడుతున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. ఇలాంటి కొంతమంది వల్ల మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ కే చెడ్డపేరు వస్తోంది. ఇదిలా ఉంటే తమిళనాడులో ఓ మహిళా ఇన్స్పెక్టర్ భారీ అవినీతికి తెరలేపింది. అయితే ఆమె అవినీతిపై మొత్తం పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుంది. తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ఉన్నతాధికారులను మచ్చిక చేసుకోవడానికి కూడా ప్రయత్నించింది. వారి మొప్పు పొందుతూనే.. మరోవైపు లంచాల రూపంలో భారీగా ఆస్తులు కూడబెట్టింది. చివరకు విచారణలో దొరికి…
IIT Student Suicide: ఐఐటీ విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఐఐటీ మద్రాస్ లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 20 ఏళ్ల పుష్పక్ అనే విద్యార్థి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం తన హాస్టల్ గదిలో ఉరేసుకుని చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. తన మరణంపై విచారణ చేయవద్దని సూసైట్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తమిళనాడులో అన్నాడీఎంకే, దాని మిత్ర పక్షం బీజేపీకి మధ్య విభేదాలు తలెత్తిన నేపథ్యంలో పొత్తు ఉంటుందా? లేదా ? అన్నది ఆసక్తి రేపుతోంది. ఐదుగురు బీజేపీ నేతలు అన్నా డీఎంకేలో చేరడంతో మొదలైన వివాదం ముదిరింది.
Udhayanidhi Stalin: డీఎంకే పార్టీ యువనేత, ఆ రాష్ట్ర మంత్రి, సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్ష అన్నాడీఎంకే, బీజేపీ కూటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు. డీఎంకే పార్టీ ఆధ్వర్యంలో కోయంబత్తూర్ లో ఆదివారం సామూహిక వివాహ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉదయనిధి హాజరయ్యారు. సీఎం ఎంకే స్టాలిన్ 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ ఖర్చుతో 81 జంటలకు పెళ్లి జరిపించారు.
Farooq Abdullah comments on Mallikarjun Kharge: ముందుగా ఎన్నికల్లో గెలుద్ధాం, ఆ తరువాత ప్రధాని ఎవరు అవుతారో చూద్దాం అని కాశ్మీర్ నేత, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్డుల్లా అన్నారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 70వ జన్మదిన వేడుకల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అబ్దుల్లా ఈ వ్యాఖ్యలు చేశారు. ఫరూక్ అబ్దుల్లా, మల్లికార్జున్ ఖర్గే, సమాజ్వాదీ పార్టీ…
Khushbu Sundar: ప్రముఖ సినీనటి, బీజేపీ నేత ఖుష్బూ సుందర్ కు కీలక పదవి లభించింది. జాతీయ మహిళా కమిషన్( ఎన్సీడబ్ల్యూ) సభ్యురాలిగా ఆమెను కేంద్రం నామినేట్ చేసింది. ఆమెతో పాటు మరో ఇద్దరిని నామినేట్ అయ్యారు. బీజేపీ జాతీయ కార్యవర్గం సభ్యురాలు అయిన ఖుష్బూ తన నియామక పత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
AIADMK Leadership row: తమిళనాడు రాజకీయ పార్టీ ఏఐడీఎంకే పార్టీ చీఫ్ గా పళనిస్వామి ఉంటారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి ఉంటారని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. అన్నాడీఎంకే పార్టీపై తన అధిపత్యాన్ని నిలుపుకోవడానికి పన్నీర్ సెల్వం చేసిన ప్రయత్నాలకు బ్రేక్ వేసింది. మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఓ పన్నీర్ సెల్వం (ఓపీఎస్) వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
Tamil Nadu: జవాను హత్యపై తమిళనాడు రాజకీయం అట్టుడుకుతోంది. డీఎంకే సర్కారుపై బీజేపీ రగిలిపోతోంది. దేశాన్ని కాపాడే సైనికులకే తమిళనాడులో భద్రత కరువైందని విమర్శిస్తోంది. తమిళనాడు వ్యాప్తంగా నిరసనలు చేస్తోంది. అటు వీధి గొడవ కారణంగా జరిగిన హత్యను బీజేపీ రాజకీయం చేస్తోందని డీఎంకే సహా ఇతర పార్టీలు మండిపడుతున్నాయి. ఇప్పటికే హత్యకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారని వాదిస్తోంది డీఎంకే. అయితే, తమిళనాడు కృష్ణగిరిలో చిన్న గొడవ విషయంలో లాన్స్ నాయక్…
ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్తో సంబంధాలున్న అనుమానితులపై భారీ అణిచివేతలో భాగంగా ఈరోజు కర్ణాటక, తమిళనాడు, కేరళలోని దాదాపు 60 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దాడులు నిర్వహించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.