IIT-Madras PhD Student Dies By Suicide: దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఐఐటీ-మద్రాస్. ఎంతో మందిని గొప్పవారిని దేశానికి అందించింది. అయితే ఇటీవల మాత్రం తరుచు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలతో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మద్రాస్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పీహెచ్డీ చేస్తున్న పశ్చిమ బెంగాల్ కు చెందిన 32 ఏళ్ల విద్యార్థి సచిన్ వేలచ్చేరిలోని తన గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Read Also: Bandi Sanjay: సింహం సింగిల్‌గానే వస్తుంది.. ఎగిరేది బీజేపీ జెండానే
ఈ ఏడాది మూడు నెలల కాలంలో ఇది మూడో ఆత్మహత్య, మొత్తంగా 2018 నుంచి 11 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మార్చి 31న మరణించిన విద్యార్థి ‘ ఐ యామ్ సారీ నాట్ గుడ్ ఇనఫ్ ’ అనే వాట్సాప్ స్టేషస్ ను పోస్ట్ చేశాడు. ఈ స్టేటస్ చూసిన అతడి స్నేహితులు అతని రూంకు చేరుకునే సమయానికి విద్యార్థి సచిన్ ఉరివేసుకుని కనిపించాడు. స్నేహితులు పోలీసులకు సమచారం అందించారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విద్యార్థి మృతికి సంతాపం తెలుపుతు ఐఐటీ-మద్రాస్ ఓ ప్రకటన విడుదల చేసింది.
అంతకుముందు మార్చి 14న మద్రాస్ ఐఐటీ క్యాంపస్ లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన వైపు పుష్పక శ్రీసాయి(20) బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఫిబ్రవరి 14న మహారాష్ట్రకు చెందిన ఓ రీసెర్చ్ స్కాలర్ ఐఐటీ క్యాంపస్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.