కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తమిళనాడు ప్రభుత్వం ఫ్యాక్టరీల (సవరణ) చట్టం 2023ని ఉపసంహరించుకున్నట్లు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ సోమవారం తెలిపారు. సంస్కరణలను తీసుకురావడానికి మాత్రమే కాకుండా, ఒక సమస్యపై ఏకాభిప్రాయ అభిప్రాయాన్ని అంగీకరించడానికి కూడా ధైర్యం అవసరమని నొక్కిచెప్పిన ఆయన.. అనేక కార్మిక సంఘాలు వ్యక్తం చేసిన భయాందోళనలను అనుసరించి వివాదాస్పద చట్టాన్ని వెనక్కి తీసుకున్నట్లు చెప్పారు.
Chennai Customs : ఇటీవల ఎయిర్ పోర్టులన్నీ స్మగ్లింగ్ లకు అడ్డాలుగా మారుతున్నాయి. విదేశాల నుంచి బంగారం, వెండి, డ్రగ్స్ లాంటివి అక్రమంగా రవాణా చేస్తూ చాలామంది పట్టుబడిన వార్తలు విన్నాం.
Chennai: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా కౌలాలంపూర్ నుంచి వచ్చి ఓ ప్రయాణికురాలి వద్ద ఏకంగా 22 పాములను గుర్తించారు. లగేజ్ బ్యాగుల్ని తనిఖీ చేస్తున్న క్రమంలో విషపూరితమైన పాములను అధికారులు గుర్తించారు. వీటిలో రకరకాల పాములు ఉన్నాయి. 10 అడుగులకు పొడవైన పాములను గుర్తించారు కస్టమ్స్ అధికారులు.
ఏటీఎంకు కొత్త నిర్వచణం చెబుతూ ఎనీ టైం మందు అంటూ ఓ సినిమాలో ఓ యాక్టర్ డైలాగ్ చెప్పిన విషయం గుర్తుందా? అది ఇప్పుడు నిజమైపోయింది.. అందేంటి? అదేలా ? అంటారా? అదేనండి బాబు.. ఇప్పుడు ఎనీ టైం మందు (ఏటీఎం)లు కూడా అందుబాటులోకి వచ్చేస్తున్నాయి.. ఏటీఎంలో కార్డు పెట్టి కావాల్సిన మొత్తాన్ని కొడితే క్యాష్ వచ్చినట్టుగానే.. ఏ లిక్కర్ కావాలో.. దానికి సరపడి డబ్బులు వేస్తే.. ఆ ఏటీఎం నుంచి మీకు నచ్చిన మందు వస్తుందన్నమాట..…
ఇదిలా ఉంటే కొందరు మాత్రం తమకు మక్కువ ఉన్న రంగంలోకి వెళ్తున్నారు. అలాంటి కోవలోకే వస్తారు తమిళనాడుకు చెందిన 27 ఏళ్ల యువకుడు వెంకటసామి విఘ్నేష్. ఇన్ఫోసిస్ వంటి ప్రతిష్టాత్మక ఐటీ కంపెనీలో ఉద్యోగం నెలకు రూ. 40,000 జీతం అయినా ఇవన్నీ వదిలేసి తనకు మక్కువ ఉన్న వ్యవసాయ రంగంలోకి వెళ్లేందుకు ఉద్యోగం మానేశాడు. తల్లిదండ్రులు మొదట్లో భయపడ్డా కూడా ప్రస్తుతం లక్షల్లో సంపాదిస్తూ.. వారి భయాలను దూరం చేశాడు.
తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహిస్తోంది. రియల్ స్టేట్ కంపెనీ జి స్క్వేర్కు చెందిన పలు ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ సోదాలు జరుగుతున్నాయి. జి స్క్వేర్ కంపెనీ గతంలో రాజకీయ వివాదాల్లో చిక్కుకుంది.
తమిళనాడు రాష్ట్రంలో దారుణం. ఆస్పతుల్లో 300 మంది రోగుల హత్య చేసినట్లు తెలుస్తోంది. బంధువులు, కుటుంబసభ్యులు సూచన మేరకే ఈ విధంగా చేసినట్లు తెలుస్తోంది. పదేళ్లుగా దాదాపు 300 మంది రోగులను హత్య చేసినట్లు మోహన్ రాజ్ అనే వ్యక్తి చెప్పిన వీడియో తమిళనాట సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
Tamilnadu: తమిళనాడు రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడిపై కొందరు లైంగిక దాడికి పాల్పడ్డారు. బస్సులో వెళుతున్న యువకుడిని కిందికి లాగి లైంగికదాడి చేసి, ఆ దృశ్యాలను వీడియో తీసి బెదిరించిన ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
తమిళనాడులో మిత్రపక్షాలుగా ఉన్న విపక్ష అన్నాడీఎంకే, బీజేపీల మధ్య దూరం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇరు పార్టీల నేతల మధ్య విభేదాలతో పొత్తుకు బీటలు వారినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో పొరుగున ఉన్న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది.
దేశంలో బీజేపీయేతర రాష్ట్రాల్లో గర్నవర్ల వర్సెస్ ప్రభుత్వాలు అన్నట్లు సాగుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో తెలగాంణ, తమిళనాడు కేరళ లాంటి రాష్ట్రాలు గవర్నర్ వ్యవస్థపై తీవ్రం మండిపడుతున్నాయి.