చెన్నైలోని రాయపేట ప్రాంతంలో సర్వీస్ లిఫ్ట్ వెలువల కాళ్లు ఇరుక్కుపోవడంతో 24ఏళ్ల హోటల్ హౌస్ కీపింగ్ సిబ్బంది చనిపోయాడు. ఈ ఘటనలో ప్రమాదానికి ముగ్గురి నిర్లక్ష్యమే కారణమని ఆరోపణలు రావడంతో.. వారిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
తమిళనాడు సర్కార్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ (TASMAC) ఆధ్వర్యంలో నిర్వహించే 500 లిక్కర్ షాపులను మూసి వేస్తున్నట్టు.. తమిళనాడు ప్రభుత్వ రిటైలర్ టాస్మాక్ ప్రకటిచింది.. సంపూర్ణ మద్యపాన నిషేధంలో భాగంగా.. తొలి విడతలో స్కూళ్లు, టెంపుల్స్ సమీపంలో ఉన్న మద్యం షాపులను మూసివేస్తున్నట్టు పేర్కొంది.
రాష్ట్రంలో డీఎంకే పాలనలో అవినీతి రాజ్యమేలుతోందని.. రాష్ట్రంలో ఒకే ఒక్కసారి బీజేపీకి అధికారం కట్టబెడితే.. అవినీతి రహిత పాలన అందిస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తమిళనాడు రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Chennai: రికార్డు స్థాయి ఎండల తర్వాత చెన్నై ప్రజలకు ఉపశమనం లభించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిశాయి. దీంతో వాతావరణం కాస్త చల్లబడింది.
Tamil Nadu: తమిళనాడులో దారుణం జరిగింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే, నడిరోడ్డుపై ఒక వ్యక్తిని వేటాడి వెంటాడి చంపేశారు. పరిగెత్తున్న యువకుడిని ఐదుగురు దారుణంగా హత్య చేశారు. ఈ హత్యకు సంబంధించిన వీడియో అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డైంది. తీవ్రగాయాలైన బాధితుడిని ఆస్పత్రికి తరలించేలోపే మార్గం మధ్యలో మరణించాడు.
Tamil Nadu: తమిళనాడు ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరింది. సీఎం స్టాలిన్ క్యాబినెట్ మంత్రి వి. సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా తమిళనాడులో రాజకీయాలు వేడెక్కాయి. అధికార డీఎంకే పార్టీ ఈడీ రైడ్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతుందని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆరోపిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా డీఎంకేకు మద్దతు పలుకుతున్నాయి.
తమిళనాడు విద్యుత్ శాఖా మంత్రి సెంథిల్ బాలాజీని పోలీసులు అరెస్ట్ చేశారు. న్ఫోర్స్మెంట్ అధికారులు తీసుకువెళుతుండగా ఛాతీలో నొప్పి రావడంతో చెన్నైలోని ఒమంతురార్ ప్రభుత్వ ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో విద్యుత్ శాఖా మంత్రి సెంథిల్ బాలాజీని చేర్చారు.
Tamil Nadu: తమిళనాడులో దారుణం జరిగింది. తనపై 40 మందికి పైగా దాడి చేసి, అసభ్యంగా ప్రర్తించారని, అసభ్య పదజాలంతో దూషించారని ఓ ఆర్మీ జవాన్ భార్య ఆదివారం ఆరోపించారు. ఈ ఘటన వేలూరులో జరిగింది. తనను అనుచితంగా తాకినట్లు ఆమె పేర్కొన్నారు. మా కుటుంబాన్ని ప్రశాంతంగా బతకనివ్వమని, బెదిరిస్తున్నట్లు బాధిత మహిళ ఆరోపించారు. శనివారం తనను అర్ధనగ్నంగా చేసి కొట్టారని ఆమె ఆరోపించారు.
Amit Shah: కాంగ్రెస్, డీఎంకే వంశపారంపర్య రాజకీయాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. ఆదివారం తమిళనాడు చెన్నైలో ఆయన పర్యటించారు. ఈ రెండు పార్టీల అవినీతిని 2G, 3G, 4Gగా అభివర్ణించారు. తమిళనాడులో ఈ పార్టీలను విసిరిపడేసి, ఈ భూమి పుత్రడుికి పట్టం కట్టాలి అని అన్నారు. తొమ్మిదేళ్ల నరేంద్రమోడీ పాలనను ప్రజలకు వివరించేందుకు జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.