The Kerala Story: “ది కేరళ స్టోరీ”కి ఊరట.. పశ్చిమ బెంగాల్ నిషేధంపై స్టే విధించిన సుప్రీంకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Kerala Story: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ‘ది కేరళ స్టోరీ’ సినిమాను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిషేధించింది. దీనిపై చిత్రనిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ రోజు దీనిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. బెంగాల్ ప్రభుత్వం నిషేధంపై స్టే విధించింది. మరోవైపు సినిమాను మల్టిప్లెక్సుల్లో బ్యాన్ చేసిన తమిళనాడు ప్రభుత్వానికి, థియేటర్లకు వచ్చే వారికి రక్షణ కల్పించాలని ఆదేశించింది. సీబీఎఫ్‌సీ ధ్రువీకరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై నిర్ణయం తీసుకునే ముందు ఆ సినిమాను ఓ సారి చూడాలనుకుంటున్నట్లు సుప్రీం తెలిపింది. తదుపరి విచారణను జూలై రెండో వారానికి వాయిదా వేసింది.
Read Also: Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదు కేసు.. శివలింగం కార్బన్ డేటింగ్‌పై విచారణకు సుప్రీం ఓకే
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ఈ రోజు సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది. ప్రజల అసహనాన్ని కారణంగా చూపుతూ చట్టపరమైన నిబంధనలను ఉపయోగించలేదు, లేదంటే అన్ని సినిమాది ఇదే పరిస్తితి అని వ్యాఖ్యానించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్(సీబీఎఫ్‌సీ) ధ్రువీకరణ పొందిన తర్వాత శాంతిభద్రతలను కాపాడాల్సిన పని రాష్ట్ర ప్రభుత్వానిదే అని సీజేఐ చంద్రచూడ్, జస్టిస్ నరసింహ, జస్టిస్ పార్దీవాలాలతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఒక వేళ సినిమా బాగా లేకపోతే బాక్సాఫీస్ వద్ద దెబ్బతింటుందని వ్యాఖ్యానించింది.
కేరళలో 35,000 అమ్మాయిలు అదృశ్యం అయ్యారని, కొందరు ఇస్లాంలో చేరి ఐసిస్ ఉగ్రవాద సంస్థ తరుపున పోరాడేందుకు సిరియా వెళ్లినట్లు చూపించే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఒక్కసారిగా ‘ది కేరళ స్టోరీ’ వివాదాల్లోకి ఎక్కింది. బీజేపీ మినహా కాంగ్రెస్, సీపీఎం, డీఎంకే, టీఎంసీ వంటి పార్టీలు ఈ సినిమాను వ్యతిరేకించాయి. కేరళ సీఎం పినరయి విజయన్ ఈ సినిమా ఆర్ఎస్ఎస్ అబద్దపు ప్రచారంగా అభివర్ణించారు. దేశవ్యాప్తంగా మే 5న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ సినిమా రూ. 150 కోట్లను కలెక్ట్ చేసింది.
తాజావార్తలు
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!