CM Stalin in Japan: జపాన్ పర్యటనలో ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బుల్లెట్ ట్రయిన్‌లో ప్రయాణించారు. ఏకంగా 500 కిలోమీటర్లు బుల్లెట్ ట్రయిన్‌లో ప్రయాణించారు. విదేశీ పెట్టుబడుల కోసం స్టాలిన్ జపాన్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. జపాన్ పర్యటనలో భాగంగా ఆదివారం బుల్లెట్ ట్రయిన్ ఎక్కారు. ఓసాకా నగరం నుంచి జపాన్ రాజధాని టోక్యో వరకు బుల్లెట్ రైల్‌లోనే ప్రయాణించారు. బుల్లెట్ రైల్‌లోని ఫోటోలను సీఎం స్టాలిన్ తను స్వయంగా ట్వీట్టర్‌లో షేర్ చేశారు. వేగవంతమైన ఇలాంటి బుల్లెట్ రైల్ సర్వీసులు భారతీయ పౌరులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ఒసాకా నుంచి టోక్యో వరకు బుల్లెట్ రైల్‌లో ప్రయాణం చేశానని.. దాదాపు రెండున్నర గంటల లోపే 500 కిలోమీటర్ల ప్రయాణం సాగిందని స్టాలిన్ ట్వీట్టర్‌లో పేర్ చేశారు.
Read Also: Manipur Violence: మళ్లీ రగులుతోన్న మణిపూర్..
తమిళనాడు రాష్ర్టానికి పెట్టుబడులను ఆకర్షించడం కోసం సీఎం ఎంకే స్టాలిన్ సింగపూర్; జపాన్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. టోక్యోలో బుల్లెట్ ట్రయిన్‌లో ప్రయాణించిన అనంతరం దాని గురించి మాట్లాడుతూ డిజైన్‌లోనే కాకుండా వేగం, నాణ్యతలోనూ బుల్లెట్ రైల్‌కు సమానమైన రైల్వే సేవలు ఇండియాలోనూ రావాలన్నారు. తద్వారా సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం కలగడంతో పాటు వారి ప్రయాణాలు సులభతరం కావాలని ఆకాంక్షిస్తూ ఫ్యూచర్‌ఇండియా అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు. అలాగే జపాన్‌లో ఉన్న తమిళులతో సీఎం స్టాలిన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తమిళుల సంస్కతిని చాటి చెప్పేలా అక్కడి చిన్నారులు నిర్వహిం కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆకట్టుకున్నాయన్నారు.