Supreme Court: కోర్టులు నైతికత గురించి బోధించే ప్రత్యేక స్థలం కానద వ్యాఖ్యానించింది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు చట్టానికి కట్టబడి ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. మహిళ అక్రమ సంబంధం నేపథ్యంలో ఇద్దరు పిల్లల్ని చంపేయడంతో పాటు తాను కూడా ఆత్మహత్యకు ప్రయత్నించిందనే కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ వ్యక్తితో అక్రమ సంబంధం ఉన్న మహిళను, ఆ సంబంధాన్ని అడ్డు పెట్టుకుని అతను బెదిరించడం వల్ల తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు మరణించగా.. మహిళ ప్రాణాలతో బయటపడింది.
Read Also: Asia Cup 2023: పాకిస్తాన్‌కు షాక్.. అలాంటి ప్రతిపాదన ఏం లేదన్న బీసీసీఐ..
ఈ కేసులో మహిళపై ఐపీసీ 302 కింద ఎఫ్ఐఆర్ నమోదు అయింది. ట్రయిల్ కోర్టులు ఐపీసీ సెక్షన్లు 302(హత్య), 309(ఆత్మహత్య) కింద సదురు మహిళను దోషిగా నిర్థారించింది. తాను 20 ఏళ్లుగా జైలులో ఉన్నానని, తనను ముందస్తుగా విడుదల చేయాలని మహిళ వేడుకుంది. అయితే ఆమె చేసిన నేరం యొక్క క్రూరత్వాన్ని, క్రూరమైన స్వభావాన్ని పరిగణలోకి తీసుకుని రాష్ట్రస్థాయి కమిటీ సిఫారసును తమిళనాడు ప్రభుత్వం తిరస్కరించింది.
తన అక్రమ సంబంధాన్ని కొనసాగించాలనే ఉద్దేశ్యంతో మహిళ తన కుమారులను హత్య చేసేందుకు ఎప్పుడూ ప్రయత్నించలేదని న్యాయమూర్తులు అజయ్ రస్తోగి, అహ్సానుద్దీన్ అమానుల్లాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. దీనికి విరుద్ధంగా పిల్లలతో కలిసి తల్లి కూడా ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ కేసులో అక్రమ సంబంధం ముఖ్యం కాదని, గొడవలు, నిరాశతోనే ఆమె ఇలా చేసిందని బెంజ్ పేర్కొంది. ఈ కోర్టు నైతికత, నీతిని బోధించే సంస్థ కాదని, చట్టబద్ద పాలనకు కట్టుబడి ఉన్నామని బెంచ్ వ్యాఖ్యానించింది. దీన్ని క్రూరమైన నేరంగా పరిగణించలేమని, సకాలంలో ఆమె మేన కోడలు గుర్తించడంతో ప్రాణాలతో బయపడిందని, అంతేకాకుండా 20 ఏళ్లు జైలులో ఉందని కోర్టు పేర్కొంది. మహిళను ముందస్తుగా విడుదల చేసేందుకు రాష్ట్ర స్థాయి కమిటీ చేసిన సిఫార్సును అంగీకరించకపోవడానికి సరైన కారణం లేదా సమర్థనీయమైన కారణం లేదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఆమెను విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది.