Chandrayaan-3: భారతదేశం మిషన్ మూన్ తమిళనాడుతో ప్రత్యేకమైన సంబంధాన్ని కలిగి ఉంది.. లాంచ్ వారి పర్యవేక్షణలో ఉంటుంది.2008లో మొదటి చంద్రుని మిషన్‌తో ప్రారంభమైన చంద్రయాన్ సిరీస్ గురించి ఒక ప్రత్యేకమైన సమాచారం వెలుగులోకి వచ్చింది.
Tamil Nadu: తమిళనాడులో టాప్ పోలీస్ ఆఫీసర్ పిస్టల్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 2009 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్ శుక్రవారం కోయంబత్తూర్ నగరంలో తన నివాసంలో డ్యూటీలో ఉన్న సెక్యురిటీ అధికారి నుంచి పిస్టల్ తీసుకుని, కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. విజయ్ కుమార్ ప్రస్తుతం కోయంబత్తూర్ రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.
తమిళనాడు రాజకీయల్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. అన్నాడీఎంకే ఎంపీ ఓపీ రవీంద్రనాథ్‌కు మద్రాసు హైకోర్ట్ షాక్ ఇచ్చింది. తేనీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఆయన ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పును వెల్లడించింది. దీంతో ఆయన ఎన్నికను హైకోర్టు క్యాన్సిల్ చేసింది. పన్నీరు సెల్వం కుమారుడు రవీంద్రనాథ్‌కు ఎదురుదెబ్బ తగలినట్లైంది.
తమిళనాడు ప్రభుత్వం ఇటీవల అన్ని హోటళ్లు, లాడ్జీలలో అతిధుల డ్రైవర్లకు టాయిలెట్లు, బాత్రూమ్లతో వసతి కల్పించడాన్ని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తమిళనాడులో రాజ్ భవన్లో అర్ధరాత్రి వరకు పొలిటికల్ హైడ్రామా సాగింది. మంత్రి పదవి నుంచి సెంథిల్ బాలాజీని తొలగిస్తున్నట్టు గవర్నర్ ఆర్ఎన్ రవి జారీ చేసిన ఉత్తర్వులను ఆయన వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుతానికి ఆ నిర్ణయాన్ని నిలిపి ఉంచారని తెలుస్తోంది.
Tamil Nadu:తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమిళనాడు క్యాబినెట్ నుంచి మంత్రి సెంథిల్ బాలాజీని తొలగిస్తూ గవర్నర్ ఆర్ఎన్ రవి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ సంఘటన మరోసారి గవర్నర్, సీఎం ఎంకే స్టాలిన్ మధ్య ఘర్షణకు కారణం కాబోతోంది.
చెన్నైలోని రాయపేట ప్రాంతంలో సర్వీస్ లిఫ్ట్ వెలువల కాళ్లు ఇరుక్కుపోవడంతో 24ఏళ్ల హోటల్ హౌస్ కీపింగ్ సిబ్బంది చనిపోయాడు. ఈ ఘటనలో ప్రమాదానికి ముగ్గురి నిర్లక్ష్యమే కారణమని ఆరోపణలు రావడంతో.. వారిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
తమిళనాడు సర్కార్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ (TASMAC) ఆధ్వర్యంలో నిర్వహించే 500 లిక్కర్ షాపులను మూసి వేస్తున్నట్టు.. తమిళనాడు ప్రభుత్వ రిటైలర్ టాస్మాక్ ప్రకటిచింది.. సంపూర్ణ మద్యపాన నిషేధంలో భాగంగా.. తొలి విడతలో స్కూళ్లు, టెంపుల్స్ సమీపంలో ఉన్న మద్యం షాపులను మూసివేస్తున్నట్టు పేర్కొంది.
రాష్ట్రంలో డీఎంకే పాలనలో అవినీతి రాజ్యమేలుతోందని.. రాష్ట్రంలో ఒకే ఒక్కసారి బీజేపీకి అధికారం కట్టబెడితే.. అవినీతి రహిత పాలన అందిస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తమిళనాడు రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.