Tamil Nadu: గవర్నర్ సంచలన నిర్ణయం.. సీఎంకి చెప్పకుండానే క్యాబినెట్ నుంచి సెంథిల్ బాలాజీ తొలగింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu:తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమిళనాడు క్యాబినెట్ నుంచి మంత్రి సెంథిల్ బాలాజీని తొలగిస్తూ గవర్నర్ ఆర్ఎన్ రవి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ సంఘటన మరోసారి గవర్నర్, సీఎం ఎంకే స్టాలిన్ మధ్య ఘర్షణకు కారణం కాబోతోంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను సంప్రదించకుండానే తమిళనాడు గవర్నర్ సెంథిల్ బాలాజీని రాష్ట్ర మంత్రివర్గం నుంచి తొలగించారు. ఇటీవల మనీలాండరింగ్ కేసులో మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్ట్ చేసింది. ఇటీవల కాలంలో ఏ గవర్నర్ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు.
జూన్ 14న మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన బాలాజీ జూలై 12 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉండనున్నారు. ఏఐడీఎంకే ప్రభుత్వంలో 2014లో రవాణా శాఖ మంత్రిగా ఉన్న బాలాజీ ఉద్యోగాల కోసం డబ్బులు తీసుకున్న ఆరోపణలు ఉన్నాయి. ఆ తరువాత 2018లో డీఎంకే పార్టీలో చేరి గెలుపొంది, స్టాలిన్ ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కించుకున్నారు.
Also Read
- CJP: ‘‘ రాజులు కాదు’’.. ABVP విజయంపై కాక్రోచ్ పార్టీ స్పందన.
- Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
- No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
- Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్‌ను చూడలేకపోతున్నారు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
Read Also: Alcohol: ఆల్కాహాల్ తాగే ముందు ఫుడ్ తినాలా..? తాగిన తర్వాత తినాలా..? ఏది బెటర్..?
సెంథిల్ బాలాజీ అరెస్ట్ సమయంలో తమిళనాడులో నానా హంగామా చోటు చేసుకుంది. ఆయనకు ఛాతి నొప్పిరావడంతో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో బైపాస్ సర్జరీ జరిగింది. సెంథిల్ బాలాజీ ప్రస్తుతం పోర్ట్ పోలియో లేకుండా మంత్రిగా ఉన్నారు. అతను నిర్వర్తించే శాఖల్ని మరోమంత్రి తంగం తెన్నరసు, ముత్తుసామిలు చూస్తున్నారు.
అయితే ఇప్పటికే గవర్నర్ రవిపై డీఎంకే పార్టీ తీవ్ర విమర్శలు చేస్తోంది. గోబ్యాక్ రవి అంటూ గతంలో డీఎంకే ఏకంగా పోస్టర్లను కూడా వేసింది. గవర్నర్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ డీఎంకే, ముఖ్యమంత్రి స్టాలిన్ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామం ఎలాంటి రాజకీయ దుమారానికి కారణం అవుతుందో చూడాలి.
తాజావార్తలు
-
CJP: ‘‘ రాజులు కాదు’’.. ABVP విజయంపై కాక్రోచ్ పార్టీ స్పందన.
-
Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
-
Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ ‘ఏ’ జట్టులోకి ఎంట్రీ..
-
Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
-
No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!