Tragic accident in Chennai hotel: చెన్నైలోని రాయపేట ప్రాంతంలో సర్వీస్ లిఫ్ట్ వెలువల కాళ్లు ఇరుక్కుపోవడంతో 24ఏళ్ల హోటల్ హౌస్ కీపింగ్ సిబ్బంది చనిపోయాడు. ఈ ఘటనలో ప్రమాదానికి ముగ్గురి నిర్లక్ష్యమే కారణమని ఆరోపణలు రావడంతో.. వారిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో చనిపోయిన వ్యక్తి పెరంబూర్ లోని హైదర్ గార్డెన్‌లో నిపసించే అభిషేక్‌గా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డా.రాధాకృష్ణన్ సలైలో ఉన్న హోటల్‌లో జూన్ 25న మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అభిషేక్ తన పనిని ముగించుకుని హోటల్ తొమ్మిదో అంతస్తు నుంది కిందికి దిగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. లిఫ్ట్ 8వ అంతస్తుపైకి వెళ్తుండగా తన వెంట తీసుకెళ్తున్న ట్రాలీ.. లిఫ్టు డోరులో ఇరుక్కుపోయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
Also Read: Fake Customs Officials: కస్టమ్స్ ఆఫీసర్లమని చెప్పి 4 లక్షలు స్వాహా చేశారు..
అతను మధ్యాహ్నం 2.30సమయంలో ట్రాలీతో 9వ అంతస్తులోని లిఫ్ట్ ఎక్కాడు. 8 అంతస్తుకు వెళ్తుండగా ట్రాలీ లిఫ్టు తలుపులో ఇరుక్కుపోయింది. అప్పుడే లిఫ్ట్ కదలడంతో అభిషేక్ మధ్యలోనే చిక్కుకుపోయాడు. అలా అతను 8వ అంతస్తులో చనిపోయాడు అని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. జూన్ 25న సాయంత్రం 5.30గంటల సమయంలో సంఘటనా స్థలానికి చేరుకున్న మైలాపూర్ అగ్నిమాపక దళం, ఎగ్మోర్ రెస్క్యూ సర్వీసెస్ అభిషేక్ మృతదేహాన్ని వెలికితీశాయి. ఈ ఘటనలో లిఫ్ట్ ఇన్ చార్జ్ గోకుల్, చీఫ్ ఇంజినీర్ వినోద్ కుమార్, హోటల్ ఆపరేటింగ్ మేనేజర్ కుమార్ లపై 304 (A) (IPC)కింద పోలీసులు కేసు నమోదు చేశారు.