Tamil Nadu: తమిళనాడులో పొలిటికల్ హైడ్రామా.. మంత్రి బర్తరఫ్‌పై వెనక్కి తగ్గిన గవర్నర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: తమిళనాడులో రాజ్ భవన్‌లో అర్ధరాత్రి వరకు పొలిటికల్ హైడ్రామా సాగింది. మంత్రి పదవి నుంచి సెంథిల్ బాలాజీని తొలగిస్తున్నట్టు గవర్నర్ ఆర్‌ఎన్ రవి జారీ చేసిన ఉత్తర్వులను ఆయన వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుతానికి ఆ నిర్ణయాన్ని నిలిపి ఉంచారని తెలుస్తోంది. తదుపరి సమాచారం వచ్చే వరకు తొలగింపు ఉత్తర్వులను నిలిపివేయాలని గవర్నర్ అర్థరాత్రి నిర్ణయించారని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు కూడా తెలియజేశారని సమాచారం.
Also Read: Uniform Civil Code: మోడీ సర్కారు సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లోనే యూసీసీ బిల్లు!
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
మనీలాండరింగ్ కేసులో నిందితుడైన వి.సెంథిల్ బాలాజీని గవర్నర్ తక్షణమే మంత్రివర్గం నుంచి తొలగించిన కొద్ది గంటల్లోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. మంత్రి సెంథిల్ బాలాజీ ఉద్యోగాల కోసం నగదు తీసుకోవడం, మనీలాండరింగ్ సహా పలు అవినీతి కేసుల్లో తీవ్రమైన క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో గవర్నర్ ఆయనను తక్షణమే మంత్రివర్గం నుంచి తొలగించారని తమిళనాడులోని రాజ్ భవన్ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే.. ఈ నిర్ణయంపై డీఎంకే ప్రభుత్వం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన న్యాయ నిపుణుల సలహా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అర్ధరాత్రి అటార్నీ జనరల్‌తో భేటీ అయిన గవర్నర్ ఆర్‌ఎన్ రవి.. ప్రస్తుతానికి ఆ నిర్ణయాన్ని నిలుపుదల చేసినట్లు సమాచారం. దీంతో బాలాజీ ప్రస్తుతానికి మంత్రిగానే కొనసాగనున్నారు. ఐదు గంటల వ్యవధిలో గవర్నర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. రెండు వారాల క్రితం అరెస్టయిన బాలాజీ ప్రస్తుతం ఉద్యోగాలకు నోటు కేసులో జైలులో ఉన్నాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఆయనను శాఖ లేని మంత్రిగా కొనసాగించారు. ఈ నిర్ణయాన్ని గవర్నర్ రవి ఏకపక్షంగా రద్దు చేశారు.
Also Read: UPI Payments: పెరిగిన యూపీఐ చెల్లింపులు.. నెరవేరనున్న 7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కల
గవర్నర్ పై సీఎం స్టాలిన్ ఫైర్
ఇదిలా ఉంటే.. బాలాజీని మంత్రివర్గం నుంచి తొలగిస్తూ గవర్నర్ జారీ చేసిన ఆదేశాలపై స్టాలిన్ సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం. అంతకు ముందు ఈ పరిణామంపై ముఖ్యమంత్రి స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. గవర్నర్‌పై ధ్వజమెత్తిన ఆయన.. తన మంత్రివర్గంలోని వ్యక్తిని తొలగించే హక్కు గవర్నర్‌కు ఉండదని మండిపడ్డారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని న్యాయపరంగానే దీనిని ఎదుర్కొంటుందని తెలిపారు. న్యాయ నిపుణులతో చర్చించేందుకు గానూ సీనియర్ నేతలను ఆహ్వానించారాయన. శుక్రవారం ఉదయం ఈ సమావేశం జరగనున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..