Udhayanidhi Stalin: “సనాతన ధర్మాన్ని నిర్మూలించండి”.. స్టాలిన్ కొడుకు వివాదాస్పద వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Udhayanidhi Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కొడుకు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం సామాజిక న్యాయానికి విరుద్ధమని, దానిని నిర్మూలించాలని శనివారం అన్నారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో పోల్చారు. ‘సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా లాంటది, దీన్ని నిర్మూలించాలి’’ అంటూ వ్యాఖ్యానించాడు. అయితే ఈ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది. బీజేపీ పార్టీ ఉదయనిధి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. తమిళనాడు మంత్రిపై కేసు పెట్టాలని పలువురు పిలుపునిచ్చారు. సీఎం స్టాలిన్, డీఎంకే పార్టీ వారసుడిగా పేరు సంపాదించుకున్న ఉదయనిధి స్టాలిన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై బీజేపీ ఘాటుగానే స్పందిస్తోంది. ‘డీఎంకే వారసుడు సనాతన ధర్మాన్ని రూపుమాపడం గురించి మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ మౌనమే ఈ జాతి విధ్వంసక పిలుపుకు మద్దతు ఇస్తోందని, పేరుకు తగ్గట్లే ఇండియా కూటమికి అవకాశం ఇస్తే వేల ఏళ్ల నాగరితకను నిర్మూలిస్తుందని’ బీజేపీ నేత అమిత్ మాల్వియా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
Also Read
- Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
Read Also: Bhaganvanth Kesari : యూట్యూబ్ మ్యూజిక్ లో ట్రెండింగ్ గా నిలిచిన గణేష్ ఆంథమ్..
చెన్నైలో జరిగిన రచయితల సదస్సులో ఉదయనిధి ఈ వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం అనే ఆలోచన తిరోగమనమైందని, దీన్ని వ్యతిరేకించడం సాధ్యం కాదని, నిర్మూలించడమే పరిష్కారం అని అన్నారు. ఇది కులం, లింగ ప్రాతిపదికన ప్రజలను విభజిస్తోందని, సమానత్వ, సామాజిక న్యాయానికి ప్రాథమికంగా వ్యతిరేకిస్తోందని అన్నారు.
ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో.. తాను మాట్లాడిన ప్రతీ మాటకు కట్టుబడి ఉంటానని ఉదయనిధి సమర్థించుకున్నారు. సనాతన ధర్మం సమాజంపై ప్రతికూలం ప్రభావంపై అంబేద్కర్, పెరియార్ చేసిన రచనల్ని ఏ వేదికలోనైనా ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. అనేెక సాంఘిక దురాచారాలకు సనాతన ధర్మమే కారణం అంటూ వ్యాఖ్యానించారు. న్యాయస్థానంలో, ప్రజాకోర్టులో ఎదరయ్యే సవాళ్లను ఎదుర్కొవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. క్రైస్తవ మిషనరీల ఆలోచనలను ఉదయనిధి స్టాలిన్, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌లు చెబుతున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై విమర్శించారు.
The only resolve that the Gopalapuram Family has is to accumulate wealth beyond the State GDP.
Thiru @Udhaystalin, you, your father, or his or your idealogue have a bought-out idea from Christian missionaries & the idea of those missionaries was to cultivate dimwits like you to… https://t.co/sWVs3v1viM
— K.Annamalai (@annamalai_k) September 2, 2023
తాజావార్తలు
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
-
Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
-
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!