Annamalai: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు, డీఎంకే యువనేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ రచ్చకు కారణమవుతున్నాయి. ‘సనాతన ధర్మాన్ని నిర్మూలించడండి’ అంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రతిపక్ష బీజేపీ పార్టీ తీవ్రంగా స్పందిస్తోంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై ఆయన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ క్రైస్తవ మిషనరీల నుంచి కొనుగోలు చేసిన ఆలోచన’’గా విమర్శించారు. ‘గోపాలపురం కుటుంబానికి ఉన్న ఏకైక లక్ష్యం రాష్ట్ర జీడీపీ కన్నా ఎక్కువ సంపాదించుకోవడమే. మీ తండ్రిది, మీది కొనుగోలు చేసిన ఆలోచన. క్రైస్తవమిషనరీల ఆలోచనల్ని చిలుకగా పెంచుకుంటున్నారు’ అంటూ తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు.
Read Also: Udhayanidhi Stalin: “సనాతన ధర్మాన్ని నిర్మూలించండి”.. స్టాలిన్ కొడుకు వివాదాస్పద వ్యాఖ్యలు..
అంతకుముందు చెన్నైలో జరిగిన రచయితర సమావేశంలో ఉదయనిధి స్ఠాలిన్ మాట్లాడుతూ.. సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా వంటిదని, దాన్ని వ్యతిరేకించడం కన్నా నిర్మూలించడమే మంచిదంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే తమిళనాడు బీజేపీ ఉపాద్యక్షుడు నటయన తిరుపతి మాట్లాడుతూ.. డీఎంకే మతతత్వ పార్టీ అని, ముస్లింలు, క్రైస్తవుల ఓటు బ్యాంకుపై ఆధారపడి ఉందని విమర్శించారు. డీకఎంకేకి ఇది కొత్త కానది దానికి మంచి చెడుగా, చెడు మంచిగా కనిపిస్తుందని ఆరోపించారు. డీఎంకే క్యాన్సర్ లాంటిది అని సనాతన ధర్మ సూత్రాల ద్వారా చికిత్స చేయబడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.