Tamil Nadu Ministers: మద్రాస్ హైకోర్టు ఇద్దరు మంత్రులకు షాకిచ్చేలా ఆదేశాలు జారీ చేసింది. వారిద్దరు 2006 నుంచి 2011 వరకు డీఎంకే నేతృత్వంలోని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేశారు. వారిద్దరిపై అక్రమాస్తుల కేసులు నమోదయ్యాయి. 2011 తరువాత అధికారంలోకి వచ్చిన అన్నా డీఎంకే ప్రభుత్వం వారిపై కేసులు కొనసాగించింది. విచారణను కొనసాగించినప్పటికీ కేసును పూర్తి చేయలేదు. 2021లో డీఎంకే తిరిగి అధికారంలోకి వచ్చింది. దీంతో ఇద్దరు మంత్రులపై విచారణ చేపట్టిన కోర్టు వారు నిర్దోషులుగా తేల్చుతూ కేసును కొట్టి వేశారు. అయితే కేసును కొట్టివేసిన తరువాత కింది కోర్టు ఇచ్చిన తీర్పును మద్రాస్ హైకోర్టు పరిశీలించిన తరువాత అక్రమాస్తుల కేసులో పునర్విచారణ చేపట్టాలని.. సుమోగోగా కేసు నమోదు చేస్తున్నట్టు హైకోర్టు ఆదేశిచ్చింది.
Read Also: Chandrayaan 3: చంద్రుడి ఉపరితలంపై ముందుగా బ్యాటింగ్ చేయాల్సిందే!
ప్రస్తుతం తమిళనాడు రాష్ట్ర మంత్రులుగా కొనసాగుతున్న కేకేఎస్‌ఎస్‌ఆర్ రామచంద్రన్, తంగం తెన్నరసు అక్రమార్జన కేసుల నుంచి దిగువకోర్టు విడుదల చేయడాన్ని తప్పుబడుతూ పునర్విచారణకు సిద్ధమైంది. ఈ కేసును సుమోటోగా స్వీకరిస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆనంద్ వెంకటేశన్ బుధవారం జారీ చేశారు. 2006 నుంచి 2011 వరకు డీఎంకే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేకేఎస్‌ఎస్‌ఆర్ రామచంద్రన్, తంగం తెన్నరసు మంత్రులుగా పనిచేశారు. 2011 తర్వాత అధికారంలోకి వచ్చిన అన్నాడీఎంకే ప్రభుత్వం మంత్రులు ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు సంపాదించారనే ఆరోపణలపై ఆ ఏసీబీ కేసులు నమోదు చేసింది. ఈ అభియోగాలపై విచారణ జరిపిన శ్రీవిల్లిపుత్తూరు కోర్టు… ఇరువురినీ నిర్దోషులుగా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం న్యాయమూర్తి జస్టిస్ ఆనంద్ వెంకటేశన్ ఈ కేసులను సుమోటోగా విచారణకు స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పులో లోపాలున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా ఏసీబీ అధికారులను ఇద్దరు మంత్రుల తరపున వాదనలను సమర్పించాలంటూ ఆదేశించారు.
ప్రభుత్వం తరఫున న్యాయవాది షణ్ముగసుందరం స్పందిస్తూ.. ఈ వ్యవహారంలో హైకోర్టు సుమోటోగా కేసును స్వీకరించడం సబబు కాదని చెప్పబోయారు. కానీ దీనిపై న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. ‘తప్పు జరిగిందని తెలిసి కూడా కళ్లు మూసుకుని కూర్చోవాలా? శ్రీవిల్లిపుత్తూరు మేజిస్ట్రేట్ వెలువరించిన తీర్పును చదివి నేను మూడు రోజులు నిద్రపోలేదు. మంత్రులను నిర్దోషులుగా విడుదల చేయాలంటూ దాఖలైన పిటిషన్లను తొలుత తీవ్రంగా వ్యతిరేకించిన అవినీతి నిరోధక శాఖ అధికారులు.. ఆ తర్వాత తమ వైఖరిని ఎలా మార్చుకోగలిగారు? రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలా దిగువ కోర్టుల తీర్పుల్లో మార్పులు జరగడం శోచనీయమంటే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ప్రభుత్వానికి అధికారులు సానుకూలంగా వ్యవరించడం సబబేనా అని అధికారులను హైకోర్టు నిలదీసింది. ఈ కేసుకు సంబంధించి కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఇరువర్గాలను జస్టిస్ వెంకదేశన్ ఆదేశించారు.