Sanatana Dharma: సనాతన ధర్మంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, సినీనటుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో గురువారం తిరుపతిలో జరిగిన ‘‘వారహి డిక్లరేషన్’’ బహిరంగ సభలో ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడారు.
Bomb Threat: తమిళనాడు రాష్ట్రంలోని మూడు స్కూల్స్ కు బాంబు బెదిరింపుల మెయిల్స్ వచ్చాయి. వీటిలో మధురైలోని కేంద్రీయ విద్యాలయం, జీవన్ స్కూల్, వేల అమ్మాల్ పాఠశాలకు ఈరోజు (సోమవారం) బాంబ్ బెదిరింపులు వచ్చాయి.
Fire Accident: టాటా గ్రూప్ కంపెనీ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హోసూరు సమీపంలోని టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం. శనివారం ఉదయం టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో మంటలు చెలరేగాయి. ఈ టాటా తయారీ యూనిట్ నుంచి నల్లటి పొగ బయటకు రావడం కనిపించింది. ఫ్యాక్టరీలో మంటలు చెలరేగినప్పుడు 1500 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ముగ్గురు…
Tamil Nadu: తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి జిల్లా పరిధిలో ఈ రోజు (శనివారం) ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని హోసూరులో ఉన్న టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
తమిళనాడులో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యాపారవేత్త కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. ఓ పాడుబడిన కారులో మృతదేహాలు లభించాయి. రంగంలోకి దిగిన పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తు్న్నారు.
Road accident: దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న సమయంలో భక్తులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తిరుచ్చి-చెన్నై హైవేపై వ్యాన్ డ్రైవర్ అదుపు తప్పి చెట్టుని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆరుగురు భక్తులు మృతి చెందగా, 13 మంది గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.
తమిళనాడులో భారీ పేలుడు సంభవించింది. విడుదల నగర్ జిల్లా శివకాశిలోని ఈస్ట్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఘటన చోటుచేసుకుంది. దీపావళి సందర్భంగా ఇతర రాష్ట్రాలకు పంపడానికి మూడు లారీల్లో టపాసులు ఎక్కిస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది.
తమిళనాడులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కీలక చర్యలు చేపట్టింది. దేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపిస్తూ రాష్ట్రంలోని హిజ్బ్-ఉత్-తహ్రీర్ అనే సంస్థకు చెందిన 11 మంది అనుమానిత సభ్యుల స్థానాలపై ఎన్ఐఏ దాడులు చేసింది.
Tamil Nadu Governor: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి మరోసారి వార్తల్లో నిలిచారు. ఇప్పటికే అక్కడి స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వానికి గవర్నర్‌కి మధ్య విభేదాలు ఉన్నాయి. అయితే, తాజాగా ఆయన చేసిన ‘‘లౌకికవాదం(సెక్యులరిజం)’’ వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమైంది.