Tamilnadu : తమిళనాడులో భారీ పేలుడు..
- తమిళనాడులో భారీ పేలుడు
- విడుదల నగర్ జిల్లా శివకాశిలో ఘటన
- లారీల్లో టపాసులు ఎక్కిస్తుండగా.. ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో భారీ పేలుడు సంభవించింది. విడుదల నగర్ జిల్లా శివకాశిలోని ఈస్ట్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఘటన చోటుచేసుకుంది. దీపావళి సందర్భంగా ఇతర రాష్ట్రాలకు పంపడానికి మూడు లారీల్లో టపాసులు ఎక్కిస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. మూడు లారీల్లో ఒకదానికొకటి వెనువెంటనే మంటలు అడ్డుకోవడంతో భారీ స్థాయిలో పేలుడు శబ్దాలతో దట్టమైన పోగా కమ్ముకున్నాయి. గోడౌన్ లో లారీని ఎక్కించే టటువంటి కార్మికులు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరకున్న ఐదు ఫైరింజలతో మంట ఆర్పుతున్నారు.
READ MORE: AP CM Chandrababu: ఇంకా నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
Also Read
ఇదిలా ఉండగా.. ఇదే నెల ఒకటిన తమిళనాడు తూత్తుకుడి జిల్లా నజరేత్ సమీపంలోని బాణాసంచా ఫ్యాక్టరీ గోదాములో పేలుడు సంభవించి ఇద్దరు కార్మికులు మృతి చెందగా, ఇద్దరు మహిళలు సహా నలుగురు గాయపడ్డారు. పటాకులను ఒకచోటి నుంచి మరోచోటికి తరలిస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేసి, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున సాయం ప్రకటించారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారని, వారిని కన్నన్, విజయ్‌లుగా గుర్తించామని పోలీసులు తెలిపారు. మరో నలుగురిని చికిత్స నిమిత్తం తిరునల్వేలి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల్లోనే మళ్లీ పేలుడు సంభవించడంతో తీవ్ర విషాదం నెలకొంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!