Tamil Nadu Governor: ‘‘సెక్యులరిజం’’తో భారత్‌కి ఏం సంబంధం.. గవర్నర్ వ్యాఖ్యలపై దుమారం..
- తమిళనాడు గవర్నర్ వ్యాఖ్యలపై రాజకీయ రగడ..
- సెక్యులరిజం యూరప్ భావన.. భారత్‌లో స్థానం లేదు..
- ఆర్ఎన్ రవి వ్యాఖ్యలపై తమిళ పార్టీలు ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu Governor: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి మరోసారి వార్తల్లో నిలిచారు. ఇప్పటికే అక్కడి స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వానికి గవర్నర్‌కి మధ్య విభేదాలు ఉన్నాయి. అయితే, తాజాగా ఆయన చేసిన ‘‘లౌకికవాదం(సెక్యులరిజం)’’ వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమైంది. ‘‘సెక్యులరిజం అనేది యూరప్ భావన, భారతదేశంలో దానికి స్థానం లేదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ఈ దేశ ప్రజలపై చాలా మోసాలు జరిగాయి. వాటిలో ఒకటి లౌకికవాదం. దీనికి తప్పుడు వివరణ ఇవ్వడానికి ప్రయత్నించారు. సెక్యులరిజం అంటే ఏమిటి..? సెక్యులరిజం అనేది యూరోపియన్ భావిన. ఇది భారతీయ భావన కాదు.’’ అని కన్యాకుమారిలో జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో రవి అన్నారు.
Read Also: Badlapur encounter: బద్లాపూర్ రేప్ నిందితుడి ఎన్‌కౌంటర్.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా మారిన అంశం..
Also Read
- Azamgarh Encounter: భార్య, కుమారుడు, ఇద్దరు పూజారుల హత్య.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
- KSLU Transgender Reservation: న్యాయ విద్యలో తొలిసారి ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్.. తొలి యూనివర్సిటీగా KSLU
- PM Modi Chintan Shibir 2026: వికసిత్ భారత్ 2047పై ఫోకస్.. నేటి నుంచి ప్రధాని మోడీ ‘చింతన్ శిబిర్’
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
చర్చి, రాజు మధ్య పోరాటం ఫలితంగా లౌకికవాదం వచ్చిందని, భారతదేశం ధర్మానికి ఎలా దూరంగా ఉంటుంది..? అని, సెక్యులరిజం అనే యూరోపియన్ భావనని అక్కడే ఉండనివ్వడం, భారతదేశానికి సెక్యలరిజం అవసరం లేదని తమిళనాడు గవర్నర్ అన్నారు. 1976లో 42వ సవరణ ద్వారా భారత రాజ్యాంగ ప్రవేశికలో “సెక్యులర్” అనే పదాన్ని చేర్చారు.
అయితే, గవర్నర్ వ్యాఖ్యల్ని రాజకీయ పార్టీలు తప్పుపట్టాయి. రాజ్యాంగం కూడా విదేశీ భావన అని ఆయన భవిష్యత్తులో చెప్పవచ్చని ప్రతిపక్షాలు విమర్శించాయి. సీపీఎం నేత బృందా కారత్ మాట్లాడుతూ.. లౌకికవాదం లేదా రాజకీయాల నుంచి మతాన్ని వేరు చేయడం భారత రాజ్యాంగంలో కీలకమని అన్నారు. ఇది ఆర్ఎస్ఎస్ భావన అని, అలాంటి గవర్నర్‌ని నియమించడం సిగ్గు చేటని ఆమె అన్నారు. సిపిఐ నాయకుడు డి రాజా గవర్నర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మరియు భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ కూడా “ధర్మపరిపాలన భావనను” తిరస్కరించారని అన్నారు. ఫెడరలిజం, ఒక వ్యక్తి ఒకే ఓటు, ప్రజాస్వామ్య అనేవి కూడా యూరప్ నుంచే ఉద్భవించాయనే లాజిక్‌ని గవర్నర్ మరిచారా..? అని కాంగ్రెస్ నేత పి. చిదంబరం ప్రశ్నించారు. సెక్యులరిజం అనేది భారతదేశానికి అత్యంత అవసరమైన భావన, ఐరోపాది కాదని, రాజ్యాంగాన్ని పూర్తిగా చదవాలని డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఇలంగోవన్ అన్నారు.
తాజావార్తలు
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
AP Weather Alert: ఉత్తరాంధ్రపై వాయుగుండం పడగ.. 48 గంటలు కీలకం.. భారీ వర్షాలు, వరదల ముప్పు!
-
New Mahindra Thar OG: కొత్త Mahindra Thar OG భారత్‌లో లాంచ్.. 2.2L డీజిల్, 2.0L టర్బో పెట్రోల్, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
Sharwanand : ఓ హిట్ కొట్టాడో లేదో శర్వానంద్ రెమ్యునరేషన్‌కు రెక్కలొచ్చాయట
-
Azamgarh Encounter: భార్య, కుమారుడు, ఇద్దరు పూజారుల హత్య.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
ట్రెండింగ్
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..