Tamil nadu: ఐదుగురు కుటుంబ సభ్యులతో వ్యాపారవేత్త ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో ఏముందంటే..!
- తమిళనాడులో ఘోర విషాదం
- ఐదుగురు కుటుంబ సభ్యులతో వ్యాపారవేత్త ఆత్మహత్య
- సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యాపారవేత్త కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. ఓ పాడుబడిన కారులో మృతదేహాలు లభించాయి. రంగంలోకి దిగిన పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తు్న్నారు.
ఇది కూడా చదవండి: Minister Nara Lokesh: ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి నారా లోకేష్
Also Read
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
- Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
మణికందన్ (50) అనే వ్యాపారవేత్త.. భార్య నిత్య, తల్లి సరోజ, ఇద్దరు పిల్లలతో సేలంలో నివాసం ఉంటున్నాడు. మణికందన్ మెటల్ వ్యాపారం చేస్తున్నాడు. ఏం కష్టమొచ్చిందో ఏమో తెలియదు గానీ.. కుటుంబమంతా తీవ్రమైన నిర్ణయం తీసుకుని ప్రాణాలు వదిలారు. తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లాలో ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతదేహాలు పాడుబడిన కారులో కనిపించాయని పోలీసులు తెలిపారు. తిరుచ్చి-కరైకుడి జాతీయ రహదారిపై బుధవారం ఉదయం కారు ఆగి ఉంది. రెండు రోజుల నుంచి కారు ఆగి ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలికి చేరుకుని డెడ్‌బాడీలను పరిశీలించారు. బాధితులు విషం సేవించి ఉంటారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
ఇది కూడా చదవండి: Devara: నైట్ ఒంటి గంటకు 500 షోలు.. మెంటలెక్కిస్తున్న అడ్వాన్స్ బుకింగ్స్
ఇక కారులోంచి సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మణికందన్.. మెటల్ వ్యాపారం చేస్తూ అప్పుల్లో కూరుకుపోయినట్లు తెలుస్తోంది. అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. వాళ్లే ఆత్మహత్యకు పురికొల్పి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సేలం నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఐదుగురు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంత దూరం వచ్చి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Ram Charan: ‘దేవర’కి చరణ్ విషెష్
తాజావార్తలు
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
-
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!