తమిళనాడు రాజధాని చెన్నైలో సీబీఐ మెరుపు దాడులు చేస్తోంది. పలుచోట్ల ఒకేసారి సీబీఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. దీంతో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. రూ.5,832 కోట్ల విలువైన బీచ్ ఇసుక తవ్వకాల కుంభకోణం కేసులో ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో సహా తమిళనాడు వ్యాప్తంగా 18 చోట్ల సీబీఐ దాడులు చేపట్టింది. అధికారులు ఇళ్లతో పాటు కార్యాలయాలను జల్లెడపడుతున్నారు.
మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకే సీబీఐ అధికారులు ఈ దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో అధికారిక అవినీతి, రాజకీయ సంబంధం, జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలు ఉన్నాయని న్యాయస్థానం పేర్కొంది. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
ఇది కూడా చదవండి: Kalvakuntla Kavitha: మైనారిటీలపై కాంగ్రెస్ కపట ప్రేమ..