తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నీట్ ప్రవేశ పరీక్ష నుంచి తమిళనాడును మినహాయించాలంటూ పంపిన వ్యతిరేక బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు. ఈ మేరకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి స్టాలిన్ వెల్లడించారు. 2021, 2022లో రాష్ట్ర శాసనసభ రెండుసార్లు నీట్ వ్యతిరేక బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపించింది. అప్పటి నుంచి పెండింగ్‌లోనే ఉంది. తాజాగా శాసనసభలో స్టాలిన్ మాట్లాడుతూ.. నీట్ వ్యతిరేక బిల్లును రాష్ట్రపతి తిరస్కరించినట్లు చెప్పారు.
ఇది కూడా చదవండి: Kethika Sharma : కెరీర్‌లో ఇప్పటి వరకు హిట్టే చూడని హాట్ బ్యూటీ
అన్ని ఆధారాలతో కేంద్రానికి పంపించినట్లు స్టాలిన్ తెలిపారు. అయినా కూడా నీట్ నుంచి తమిళనాడును మినహాయించేందుకు కేంద్రం నిరాకరించిందని పేర్కొన్నారు. దక్షణాది రాష్ట్రాలను అవమానించడమే బీజేపీ ఉద్దేశమని తెలిపారు. అయినా కూడా కేంద్రంపై పోరాటాన్ని ఆపేదిలేదన్నారు. న్యాయపరంగా పోరాడేందుకు సిద్ధపడుతున్నట్లు చెప్పారు. న్యాయపుణులను సంప్రదిస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 9న అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని ప్రకటించారు.
ఇది కూడా చదవండి: AP Secretariat: ఫైర్ సేఫ్టీ అలారం ఎందుకు పనిచేయలేదో దర్యాప్తు చేస్తున్నాం: హోంమంత్రి
వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇప్పటికే త్రిభాషా విధానం, డీలిమిటేషన్‌పై కేంద్రంతో స్టాలిన్ ప్రభుత్వం పోరాడుతోంది. పార్లమెంట్ ఉభయ సభల వేదికగా డీఎంకే పోరాటం చేస్తోంది. తాజాగా నీట్ వ్యతిరేక బిల్లును తిరస్కరించడంతో డీఎంకే చేస్తుందో చూడాలి.