Tamil Nadu: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సంచలన ప్రకటన చేశారు. తాను బీజేపీ అధ్యక్ష రేసులో లేనని చెప్పడం సంచలనంగా మారింది. వచ్చే ఏడాది, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో అన్నామలై నిర్ణయం షాక్‌కి గురిచేసింది. అన్నాడీఎంకే, బీజేపీ మధ్య పొత్తు చిగురిస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది. గత వారం అన్నాడీఎంకే చీఫ్ పళని స్వామి, పార్టీ ముఖ్య నేతలు ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయ్యారు. పొత్తు నేపథ్యంలోనే అన్నామలై పార్టీ అధ్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం.
Read Also: Annamalai: బీజేపీ అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న అన్నామలై..
ఇదిలా ఉంటే, తమిళనాడు బీజేపీ కొత్త అధ్యక్షులు ఎవరనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ఈ నేపథ్యంలో తమిళిసై సౌందర్‌రాజన్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. గతంలో ఈమె తెలంగాణ గవర్నర్‌గా కూడా పనిచేశారు. మహిళ కావడం, ఎన్నికల్లో మహిళా ఓట్లు కీలకం కావడంతో పార్టీ ఈమెను అధ్యక్షురాలిగా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర సహాయమంత్రి ఎల్ మురుగన్, కోయంబత్తూర్ మురుగానందం పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. అన్నామలై చేపట్టిన ‘‘ఎన్ మన్-ఎన్ మక్కళ్’’ యాత్ర విజయవంతం కావడంలో మురుగానందం కీలక పాత్ర పోషించారు.