నిత్యానంద.. ఈ పేరు తెలియని వారుండరు. స్వయం ప్రకటిత ‘దేవుడి’గా ప్రకటించుకున్నారు. అయితే తాజాగా తమిళనాడు మీడియాలో నిత్యానంద చనిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. నిత్యానంద మేనల్లుడు సుందరేశ్వరన్ మీడియాకు సందేశం పంపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితమే చనిపోయాడని.. ఆయన మరణవార్త బాధాకరమని పేర్కొన్నట్లుగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ వార్తను మరికొందరు కొట్టిపారేస్తున్నారు. ఇది ‘ఏప్రిల్ పూల్’గా పేర్కొంటున్నారు. నిత్యానంద చనిపోయినట్లుగా అధికారికంగా ఇప్పటివరకు ఎవరూ ప్రకటన చేయలేదు.
ఇది కూడా చదవండి: Star Heros : స్టైలిష్ లుక్ వద్దు.. రగ్డ్ లుక్ ముద్దు అంటున్న స్టార్ హీరోలు
తమిళనాడులోని తిరువన్నామలైలో నిత్యానంద జన్మించారు. అటు తర్వాత కర్ణాటకలోని బీదర్‌కు వెళ్లిపోయారు. ఇక భారత్ నుంచి మరొక ప్రాంతానికి వెళ్లిపోయి తానొక దేశాన్ని సృష్టించినట్లు తెలిపారు. దానికి ‘కైలాస’ అని పేరు పెట్టారు. 2019లో ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస’గా పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు ఆ మధ్య వైరల్ అయ్యాయి. కానీ దీనిపై స్పష్టత రాలేదు. ఇక 2023లో నిత్యానంద ప్రతినిధులు ఐక్యరాజ్యసమితి సమావేశానికి హాజరై.. హిందూ వ్యతిరేక శక్తులు వేధిస్తున్నారంటూ ఆరోపించారు.
ఇది కూడా చదవండి: LSG vs PBKS: హార్డ్ హిట్టర్ల సమరం.. పరుగుల వరద ఖాయం! తుది జట్లు ఇవే