Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఖమేనీ కొడుకు.. ఎవరీ మోజ్తబా ఖమేనీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mojtaba Khamenei: ఇరాన్ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. వైమానిక దాడిలో సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించినట్లు ధృవీకరించిన కొద్ది గంటల్లోనే, ఆయన కుమారుడు మోజ్తబా ఖమేనీ (55) దేశ తదుపరి అత్యున్నత నాయకుడిగా ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 28న తేహ్రాన్‌లోని తన కార్యాలయంపై జరిగిన దాడిలో 86 ఏళ్ల అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ స్టేట్ మీడియా వెల్లడించింది. అలీ ఖమేనీ మరణవార్తతో ఇరాన్ ప్రభుత్వం దిగ్భ్రాంతికి గురైంది. దేశంలో 7 రోజుల ప్రభుత్వ సెలవుతో పాటు, 40 రోజుల పాటు జాతీయ సంతాప దినాలను ప్రకటించింది. ప్రధాన నగరాలు, ప్రభుత్వ భవనాలు, సైనిక స్థావరాల వద్ద అదనపు భద్రతా దళాలను మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా పెంచారు.
READ ALSO: Krrish-4 : ‘క్రిష్ 4’ విషయంలో హృతిక్ రోషన్ షాకింగ్ నిర్ణయం..
Also Read
- Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
- Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
- iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ఎవరీ మోజ్తబా ఖమేనీ..
1969లో మషాద్ నగరంలో జన్మించిన మోజ్తబా ఖమేనీ, చిన్నతనం నుంచే మతపరమైన విద్యను అభ్యసించారు. ఇరాన్-ఇరాక్ యుద్ధం చివరి దశలో ఆయన రివల్యూషనరీ గార్డ్స్ (IRGC)లో పనిచేశారు. దీనివల్ల ఆయనకు సైనిక, పారామిలిటరీ దళాలతో బలమైన సంబంధాలు ఉన్నాయి. మోజ్తబా ఎప్పుడూ ప్రత్యక్షంగా ప్రభుత్వ పదవులు నిర్వహించలేదు. కానీ, తన తండ్రికి అత్యంత నమ్మకమైన సలహాదారుగా ఉంటూ, ఇరాన్ కీలక నిర్ణయాల్లో తెరవెనుక చక్రం తిప్పేవారని చెబుతుంటారు. 2009లో ఇరాన్‌లో జరిగిన భారీ నిరసనల సమయంలో మోజ్తబా పేరు మొదటిసారిగా అంతర్జాతీయ స్థాయిలో చర్చకు వచ్చింది. ఆ నిరసనలను కఠినంగా అణచివేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. 1979 ఇస్లామిక్ విప్లవం ప్రధానంగా ‘రాజవంశ పాలన’కు వ్యతిరేకంగా జరిగింది. ఇప్పుడు మళ్లీ తండ్రి తర్వాత కుమారుడే అత్యున్నత పదవిని చేపట్టడం ఇరాన్ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది. కొందరు దీనిని విప్లవ ఆదర్శాలకు విరుద్ధమని భావిస్తుండగా, సైనిక మద్దతు మాత్రం మోజ్తబాకు బలంగా ఉందని చర్చించుకుంటున్నారు. కొత్త సుప్రీం లీడర్ నాయకత్వంలో ఇరాన్ ఇప్పుడు ఏ దిశగా సాగుతుంది, అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు మోజ్తబా ఎలా స్పందిస్తారు, అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!