31 ఏళ్ల గూగుల్ ఉద్యోగి న్యూయార్క్‌లోని చెల్సియాలో గల ప్రధాన కార్యాలయంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 31 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గురువారం చెల్సియాలోని గూగుల్ 14వ అంతస్తు భవనంపై నుంచి ఉద్యోగి దూకి మృతి చెందినట్లు నివేదిక పేర్కొంది.
ఈ రోజుల్లో చిన్నచిన్న విషయాలకే మనస్తాపం చెంది తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. అలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చేటుచేసుకుంది. బ్యూటీపార్లర్‌కు వెళ్లకుండా తన భర్త అడ్డుకున్నందుకు ఓ మహిళ(34) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
విధి ఆ కుటుంబంపై పగబట్టింది. చదువులో అద్భుతంగా రాణిస్తున్న కూతురికి ఉన్నట్టుండి ఊహించని విధంగా రోడ్డు ప్రమాదంలో వెన్నెముక దెబ్బతినడంతో మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది. అప్పటిదాకా ఎంతో ఆనందంగా ఉన్న ఆ కుటుంబం ఒక్కసారిగా కష్టాల్లో పడింది.
ఘజియాబాద్‌లో ఓ వ్యక్తి తన ప్రియురాలిని కాల్చి చంపి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 26 ఏళ్ల వ్యక్తి విషం సేవించి ఆత్మహత్యకు ముందు తన ప్రియురాలిని కాల్చి చంపాడని పోలీసులు తెలిపారు.
Farmer : ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అందరికీ అన్నం పెట్టే అన్నదాత అధికారుల ముందే ఆత్మార్పణ చేసుకోవడం పలువురిని కంట తడి పెట్టించింది.
ప్రముఖ నటి ఆకాంక్ష దుబే మరణ వార్తతో భోజ్‌పురి పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని ఓ హోటల్‌లో నటి శవమై కనిపించింది. 'మేరీ జంగ్ మేరా ఫైస్లా' సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన 25 ఏళ్ల ఆకాంక్ష ఆత్మహత్య చేసుకుని మరణించింది.
ఇంట్లో గొడవల కారణంగా ఓ వ్యక్తి తన భార్యను హతమార్చి, ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాలోని కృష్ణగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుతిర్పారా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Bus Conducter: పేరుకే ప్రభుత్వ ఉద్యోగం.. కానీ, పెరిగిన ధరల కారణంగా.. కుటుంబంలో ఖర్చులు ఎక్కువయ్యాయి. అప్పు చేయక తప్పలేదు. దీంతో తిరిగి చెల్లించే దారి తోచక విధులు నిర్వహించే బస్సులోనే ప్రాణాలు తీసుకున్నాడు ఓ కండక్టర్.
అధికారుల ఓత్తిడో లేక కుటుంబ కలహాలో డ్యూటీలో ఉన్న కండక్టర్ బస్సులోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ ఆర్టీసీ డిపోలో చోటుచేసుకుంది. డ్యూటీలో ఉన్న కండక్టర్ గార్లపాటి మహేందర్ రెడ్డి బస్సులో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడంతో ఈసంఘటన సంచలనంగా మారింది.