Farmer : అధికారుల ముందే ప్రాణాలను తీసుకున్న అన్నదాత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farmer : ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అందరికీ అన్నం పెట్టే అన్నదాత అధికారుల ముందే ఆత్మార్పణ చేసుకోవడం పలువురిని కంట తడి పెట్టించింది. తన భూమి ఆక్రమణకు గురైందని ఓ రైతు ఎంత వేడుకున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. దీంతో విసిగి వేసారిన ఆ రైతు ఉన్నతాధికారుల ముందే చేతి మణికట్టు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన భూమిని వేరే వ్యక్తులు ఆక్రమించుకోవడంతో రైతు చాలా కాలంగా ఆందోళన చెందుతున్నాడు. పలుమార్లు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదు. రైతు చేతి నరము కోసుకున్నాడు. రక్తంతో తనతో తెచ్చిన ఫిర్యాదు లేఖ తడిసిపోయింది. రైతును ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Read Also: Mla Sanjay Kumar : అవును మేం ఓట్ల బిచ్చగాళ్లమే..
Also Read
- Bihar: బీహార్‌లో దారుణం.. నడిరోడ్డుపై బాలికపై లైంగిక వేధింపులు.. ముగ్గురు అరెస్ట్
- AP Government: జూనియర్ డాక్టర్లకు ప్రభుత్వం శుభవార్త.. ఉత్తర్వులు జారీ
- CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
- Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
డిడోలి గ్రామానికి చెందిన 65 ఏండ్ల సుశీల్ త్యాగీ బతుకుదెరువు కోసం వచ్చి ఇంద్రపురి కాలనీలో నివసిస్తున్నాడు. గ్రామంలో కొంతమంది సుశీల్ భూమిని ఆక్రమించారు. ఈ విషయంపై ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదు. రక్తంతో రాసిన లేఖను రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు పంపాడు. శనివారం ‘సంపూరన్ సమాధాన్ దివస్’ను పురస్కరించుకొని ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. తన సమస్యకు పరిష్కారం దొరుకుతుందేమోనని వెళ్లిన సుశీల్ ఉన్నతాధికారుల ముందు గోడు వెళ్లబోసుకున్నాడు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ సమక్షంలో సుశీల్ త్యాగీ హఠాత్తుగా తన చేయి కోసుకొన్నాడు. మీరట్ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే సుశీల్ త్యాగీ చనిపోయాడు.
Read Also: Uddhav Thackeray : ఔను అధికారం కోసమే కలిశాం..
పోస్టుమార్టం నివేదిక తర్వాత రైతు మృతికి గల కారణాలు తెలుస్తాయని అదనపు జిల్లా మెజిస్ట్రేట్ (ఏడీఎం) రీతూ సుహాస్ తెలిపారు. త్యాగి తన స్వగ్రామం డిడోలి నుంచి ముజఫర్‌నగర్ జిల్లాలోని ఇంద్రపురి కాలనీకి మారాడని, ఆయన లేకపోవడంతో ఆయన భూమి కబ్జాకు గురైందన్నారు. దాని కోసమే తిరుగుతున్నాడని రైతు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
జిల్లా మేజిస్ట్రేట్ ఆర్కే సింగ్ మాట్లాడుతూ రెవెన్యూ శాఖ తన భూమిని రెండుసార్లు కొలిచేందుకు ప్రయత్నించిందని, అయితే గ్రామంలో ఇళ్ల నిర్మాణం కారణంగా భూమి జాడ తెలియలేదని చెప్పారు. ఈ వ్యవహారంలో విచారణను ఏడీఎం అడ్మినిస్ట్రేషన్ రీతూ సుహాస్‌కు అప్పగించినట్లు తెలిపారు. ఆయన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని సింగ్ చెప్పారు.
తాజావార్తలు
-
Bihar: బీహార్‌లో దారుణం.. నడిరోడ్డుపై బాలికపై లైంగిక వేధింపులు.. ముగ్గురు అరెస్ట్
-
ఇండియాలో అడుగుపెడుతున్న Apple Pay .. ఫోన్‌పే, జీపేల కథ ఏంటి ?
-
AP Government: జూనియర్ డాక్టర్లకు ప్రభుత్వం శుభవార్త.. ఉత్తర్వులు జారీ
-
Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
-
Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!