Bus Conducter: పేరుకే ప్రభుత్వ ఉద్యోగం.. కానీ, పెరిగిన ధరల కారణంగా.. కుటుంబంలో ఖర్చులు ఎక్కువయ్యాయి. అప్పు చేయక తప్పలేదు. దీంతో తిరిగి చెల్లించే దారి తోచక విధులు నిర్వహించే బస్సులోనే ప్రాణాలు తీసుకున్నాడు ఓ కండక్టర్. ఈ సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. అతడి ఆత్మహత్యతో తెలంగాణ ఆర్టీసీలో విషాదం అలుముకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Read Also:Teacher Obscene Videos: కీచక టీచర్.. విద్యార్థినులకు బూతు వీడియోలు చూపించి..
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఓ ఆర్టీసీ కండక్టర్ తాను డ్యూటీ చేసే బస్సులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. కంఠాయపాలెంకు చెందిన మహేందర్ రెడ్డి తొర్రూరు డిపోలో ఆర్టీసీ కండక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. రోజూలాగే ఆదివారం విధులకు హాజరయ్యాడు. ఉదయం పదకొండు గంటల సమయంలో డ్యూటీ రిజిస్టర్‌లో సంతకం పెట్టి డిపోలోకి వెళ్లారు. కానీ.. మళ్లీ తిరిగి రాలేదు. ఎంతసేపటికీ మహేందర్ రెడ్డి బయటకు రాకపోవటంతో.. సెక్యూరిటీ సిబ్బందికి అనుమానం వచ్చింది. డిపో మొత్తం వెతికారు. ఎక్కడా కనబడకపోయేసరికి.. అతను డ్యూటీ చేసే బస్సులో చూసేసరికి.. మహేందర్ రెడ్డి కండువా ఉరేసుకుని విగతజీవిగా దర్శనమిచ్చాడు.
Read Also:Pregnants Problems in Agency: గిరిజనులకు తప్పని డోలి కష్టాలు.. నిండు గర్భిణికి నరకయాతన
వెంటనే సెక్యూరిటీ సిబ్బంది డిపో అధికారులకు అందించారు. వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. మహేందర్ రెడ్డి వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడా.. లేదా.. ఉన్నతాధికారుల వేధింపులే కారణమా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మహేందర్ రెడ్డి మృతికి ఆర్టీసీ డిపో ఉద్యోగులు, తోటి సిబ్బంది నివాళులర్పించారు.