Chicken : ఈ మధ్య కాలంలో చావంటే చాలా ఈజీ అయిపోయింది. జనాలకు కొంచెం కూడా ఓపిక, ఆలోచన లేకుండా అయిపోతున్నారు. చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు తీసుకుంటున్నారు.
ఐపీఎల్ వచ్చిందంటే కేవలం క్రికెట్ వినోదం మాత్రమే కాదు.. బెట్టింగులు కూడా జోరుగా సాగుతాయి. ఎక్కువగా యువతే ఈ బెట్టింగులకు పాల్పడుతుంటారు. ఇందులో కొంతమందికి లాభలొస్తే మరికొందరూ తీవ్రంగా నష్టపోయి అప్పుల పాలవుతారు.
Hyderabad: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ లో విషాదం నెలకొంది. ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది.. కె.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్ పరిధిలోని కె.పి.హెచ్.బి కాలనీ 7వ ఫేజులో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు.
ఈఎంఐ డబ్బులు కట్టమని తన కొడుకుకు ఓ తండ్రి 12 వేల రూపాయలు ఇవ్వగా.. అతను తన అవసరాలకు వాడుకున్నాడు. ఆ విషయం తెలిసిన తండ్రి.. కొడుకుని మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన ఆ యువకుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఒకరోజంతా బయట ఉండి తెల్లారి ఇంటికి వచ్చాడు. ఆ రాత్రికే స్నేహితుడి పుట్టినరోజు ఉందని చెప్పి బయటకు వచ్చి.. ఇన్స్టాలో ఇదే తన చివరి రోజంటూ పోస్ట్ పెట్టాడు.
విద్యార్థుల నైపుణ్యాలను తెలుసుకునేందుకు నిర్వహించే పరీక్షలు వారి పాలిట మృత్యువుగా మారుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అవగాహన కంటే ర్యాంకులకే అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతోంది.
హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుండి దూకి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2023, మే 6వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.
31 ఏళ్ల గూగుల్ ఉద్యోగి న్యూయార్క్లోని చెల్సియాలో గల ప్రధాన కార్యాలయంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 31 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గురువారం చెల్సియాలోని గూగుల్ 14వ అంతస్తు భవనంపై నుంచి ఉద్యోగి దూకి మృతి చెందినట్లు నివేదిక పేర్కొంది.
ఈ రోజుల్లో చిన్నచిన్న విషయాలకే మనస్తాపం చెంది తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. అలాంటి ఘటనే మధ్యప్రదేశ్లోని ఇండోర్లో చేటుచేసుకుంది. బ్యూటీపార్లర్కు వెళ్లకుండా తన భర్త అడ్డుకున్నందుకు ఓ మహిళ(34) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
విధి ఆ కుటుంబంపై పగబట్టింది. చదువులో అద్భుతంగా రాణిస్తున్న కూతురికి ఉన్నట్టుండి ఊహించని విధంగా రోడ్డు ప్రమాదంలో వెన్నెముక దెబ్బతినడంతో మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది. అప్పటిదాకా ఎంతో ఆనందంగా ఉన్న ఆ కుటుంబం ఒక్కసారిగా కష్టాల్లో పడింది.