కరోనాతో తల్లి మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకులోనై కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మధుబాన్ కాలనీలో శనివారం ఈ విషాద ఘటన జరిగింది. చెరువులోకి దూకి బలవన్మరణానికి పాల్పడే ముందు యువకుడు శ్రీహరి (22) సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఇందులో తన కుటుంబ పరిస్థితిని వివరిస్తూ తన ఆవేదనను వెలిబుచ్చాడు.కరోనా బారినపడిన మా అమ్మ రుక్మిణి(60) చికిత్స పొందుతూ గచ్చిబౌలిలోని ప్రైవేట్ దవాఖానలో మృతి చెందింది. రూ. 10 లక్షలు…
ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కంటే ఎక్కువగా కరోనా ఆలోచనలు జనాల్ని వెంటాడుతున్నాయి. దీనితో మరింత అనారోగ్యపాలవుతున్నారు. మరికొందరు ఆత్మహత్యలు కేసు చేసుకుంటున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. టైఫాయిడ్ వస్తే కరోనా సోకిందని భయపడి ఓ కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. వేపాడ మండలంలోని నల్లబిల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఉడత సత్యనారాయణ గుప్తా (62) రెండు సంవత్సరాలుగా విశాఖపట్టణం జిల్లాలోని చోడవరంలో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. గుప్తాకు భార్య…
ఏపీలోని గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆ జిల్లాలోని చుండూరు ఎస్సై శ్రావణి, కానిస్టేబుల్ రవీంద్ర ఆత్మహత్యాయత్నం చేశారు. గడ్డి మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నం చేశారు. సకాలంలో వారిని ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వారు చికిత్స పొందుతున్నారు. అసత్య ప్రచారాలతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం అందుతోంది. అయితే ఈ ఘటనపై చుండూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎస్సై శ్రావణి…
రాజేంద్రనగర్ గండిపేట మండలం నార్సింగీ లో విషాదం చోటు చేసుకుంది. టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ లో హోం గార్డుగా విధులు నిర్వహిస్తున్న రాజేంద్ర ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఇంటి పై కప్పు రాడుకు చీరతో ఉరి వేసుకొని బలవన్మరణంకు పాల్పడ్డాడు హోం గార్డు. అనేకమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ డబ్బులు పెట్టుకొని స్థోమత లేక ఆత్మహత్య కు చేసుకున్నట్లు సమాచారం. అయితే స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న నార్సింగీ…