Google Engineer Suicide: గూగుల్ ఆఫీస్‌పై నుంచి దూకి యువ టెకీ ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Google Engineer Suicide: 31 ఏళ్ల గూగుల్ ఉద్యోగి న్యూయార్క్‌లోని చెల్సియాలో గల ప్రధాన కార్యాలయంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 31 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గురువారం చెల్సియాలోని గూగుల్ 14వ అంతస్తు భవనంపై నుంచి ఉద్యోగి దూకి మృతి చెందినట్లు నివేదిక పేర్కొంది. ఆ వ్యక్తి వివరాలను పోలీసులు, అధికారులు వెల్లడించలేదు. మృతుడి కుటుంబ సభ్యులకు ఇంకా సమాచారం ఇవ్వలేదు. ఫిబ్రవరిలో ఓ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న తర్వాత చోటుచేసుకోవడం ఇది రెండో ఘటన.
Read Also: Viral : భారీ శ్వేత నాగు.. ఆశ్చర్యపోయిన స్థానికులు.. వీడియో వైరల్
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
14వ అంతస్తు నుంచి దూకి అతడు ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. గురువారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కార్యాలయం వద్ద ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో నేలపై పడి ఉన్నాడన్న సమాచారంపై పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. నేలపై అచేతనంగా పడి ఉన్న అతడిని సమీప ఆసుపత్రికి తరలించగా అతడు అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. అయితే, గూగుల్ కార్యాలయం 14వ అంతస్తు అంచుపై టెకీ చేతి వేలి ముద్రలు లభించడంతో అతడు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై గూగుల్ ఇంకా స్పందించాల్సి ఉంది. ఫిబ్రవరిలో ఇదే కార్యాలయంలోని ఓ గూగుల్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రాట్(33) తన అపార్ట్‌మెంట్‌లో ఉరి వేసుకున్నాడు. దీంతో, గూగుల్ ఉద్యోగుల మానసిక ఆరోగ్యంపై మరోసారి చర్చ మొదలైంది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!