డాక్టర్లు దేవుడితో సమానం అంటారు. చావుబతుకుల మధ్య ఉన్న రోగికి వైద్యం చేసి ప్రాణాలు నిలబెడతారు. అందుకే వైద్యుల్ని దేవుడితో సమానం అంటారు పెద్దలు. ఇది ముమ్మాటికీ వాస్తవమే.
దేశ వ్యాప్తంగా పరీక్షల కాలం వచ్చేసింది. ఇప్పటికే ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమైపోయాయి. ఇక త్వరలోనే పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే విద్యార్థులంతా పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.
విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది.. ఇప్పుడు మరో కీలక ముందడుగు వేసింది.. ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ ఐబీ సిలబస్ తీసుకురానున్నారు.. రాష్ట్ర ప్రభుత్వ SCERTతో అంతర్జాతీయ విద్యా బోర్డు IB భాగస్వామ్యం కాబోతోంది.. దీనికి సంబంధించి ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో ఒప్పందం జరగనుంది.. ఈ రోజు ఉదయం 10 గంటలకు అంతర్జాతీయ విద్యా బోర్డుతో రాష్ట్ర ప్రభుత్వ ఎస్‌సీఈఆర్‌టీ (SCERT) ఒప్పందం చేసుకోబోతోంది..
HCA invites Students to watch IND vs ENG Test for free at Uppal Stadium: జనవరి 11 నుంచి అఫ్గానిస్థాన్‌తో భారత్ టీ20 సిరీస్ ఆడనుంది. అనంతరం భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుంది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జనవరి 25న తొలి టెస్ట్ మ్యాచ్ ఆరంభమవుతుంది. ఈ టెస్టు మ్యాచ్ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)…
బ్రిటన్ లో చదువుకునే వారికి అక్కడి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. బ్రిటన్లో చదువుకునేందుకు భారత్తో పాటు విదేశాల నుంచి వెళ్లే విద్యార్థులు తమ బంధువులను తమ వెంట తీసుకెళ్లకూడదని చెప్పారు.
క్రిస్మస్ సందర్భంగా తన అధికారిక నివాసాన్ని పాఠశాల విద్యార్థినులు సందర్శించారు. ఈ సందర్భంగా.. వారి ముఖాల్లో సంతోషం స్పష్టంగా కనిపిస్తున్న వీడియోను ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పిల్లలు థంబ్స్-అప్ ఇవ్వడంతో తన కార్యాలయం అంతిమ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్టు అనిపిస్తోందని ప్రధాని అన్నారు.
ఎనిమిదో తరగతి విద్యార్థులకు శుభవార్త.. రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేతుల మీదుగా వారికి ఉచితంగా ట్యాబ్లు పంపిణీ చేసేందుకు సిద్ధం అయ్యింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రేపు సీఎం వైఎస్ జగన్ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో పర్యటించనున్నారు.. ఈ పర్యటనలో 8వ తరగతి విద్యార్ధులకు ఉచితంగా ట్యాబ్లు అందజేసే కార్యక్రమానికి శ్రీకారంట చుట్టనున్నారు.. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు సీఎం జగన్.