Telangana: ఇందిరమ్మ రాజ్యంలో ఉద్యోగాల జాతర కొనసాగుతుంది అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రతి వారం ఎదో ఒక నియామక పత్రాలు ఇస్తున్నాం.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో 25 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పుకొచ్చారు. గతంలో రిప్రజేంటేషన్ ఇవ్వడానికి కూడా సమయం ఇవ్వని గత పాలకులు నేడు ఉద్యోగాల జాతరను చూసి ఓర్వలేక ప్రతి రోజూ ఏదో ఒక విమర్శలు చేస్తున్నారు.. ఎన్ని దూషణలు చేసిన నిబద్దత సంకల్ప బలంతో ఇచ్చిన ప్రతి హామీని తూ.చ తప్పకుండా అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. మీ విమర్శలు మాకు అడ్డంకి కానే కావు.. మీ దగ్గర వేల కోట్ల రూపాయలు ఉండవచ్చు వేల మందితో సోషల్ మీడియా నిర్వహిస్తూ ప్రజలను పక్కదోవా పట్టిస్తున్నారు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
Read Also: Upendra Singh Rawat: నిర్దోషి అని నిరూపించుకునే వరకు ఎన్నికల్లో పోటీ చేయను..
పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తామని చెప్పాం చేసి చూపించాము అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ వేయకుండా యూనివర్సిటీలో ఉన్న నిరుద్యోగుల ఆశలు అడియాసలు చేశారు అంటూ విమర్శలు గుప్పించారు. మా ప్రభుత్వం 3 నెలల్లో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చాం.. రాష్ట్రంలో చదువుకున్న ప్రతి బిడ్డ ఉద్యోగం పొందాలి.. ఆ ఉద్యోగం ద్వారా కుటుంబం ద్వారా సమాజం బాగుపడాలి అని ఆయన చెప్పుకొచ్చారు. నోటిఫికేషన్ తో పాటు వేల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ లు ఒకే గదిలో పది మంది ఉంటున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది.. హైదరాబాద్ నడి బొడ్డున జ్యోతి రావు ఫూలే ప్రజా భవన్ నుంచి రూపాయి ఖర్చు లేకుండా పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాం అని భట్టి విక్రమార్క తెలిపారు.
Read Also: Peru: హైవేపై షాకింగ్ ఘటన.. తుక్కుతుక్కైన భారీ వెహికల్స్.. ఎలా అంటే!
రాష్ట్రం నుంచే కాదు దేశంలోనే అత్యుత్తమైన సబ్జెక్టు ఎక్స్ పర్ట్స్ తో పాఠాలు చెప్పించనున్నామని డిప్యూటీ సీఎం భట్టి చెప్పారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆన్ లైన్ లో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాము.. సోదరులారా ఇది మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని ఆయన పేర్కొన్నారు. నిష్టా గరిష్టతతో పని చేస్తాం.. చేసే క్రమంలో ఏలాంటి ఆర్ధిక ఇబ్బందులు వచ్చిన ఎదుర్కొంటాము అన్నారు. బాగా చదువుకుని ఉద్యోగాలు పొందిన వారికి.. వారి తల్లిదండ్రులకు అభినందనలను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.