CBSE: డయాబెటిస్ విద్యార్థులకు శుభవార్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా పరీక్షల కాలం వచ్చేసింది. ఇప్పటికే ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమైపోయాయి. ఇక త్వరలోనే పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే విద్యార్థులంతా పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. అయితే కొంత మంది విద్యార్థులు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి విద్యార్థుల (Students) కోసం సీబీఎస్‌ఈ బోర్డు (CBSE Board) ప్రత్యేక సౌకర్యాలను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం మార్గదర్శకాలను జారీ చేసింది.
Also Read
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2024 బోర్డు పరీక్షలకు హాజరయ్యే టైప్-1 డయాబెటిస్‌తో (Diabetes) బాధపడుతున్న విద్యార్థుల కోసం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిగణనలోకి తీసుకుని మార్గదర్శకాలను విడుదల చేసినట్లు CBSE తెలిపింది.
మార్గదర్శకాల ప్రకారం.. విద్యార్థులు ఈ క్రింది వస్తువులను తీసుకెళ్లేందుకు అనుమతించింది.
- చక్కెర మాత్రలు/చాక్లెట్/కాండీ
అరటి/ఆపిల్/ఆరెంజ్ పండ్లు
శాండ్‌విచ్ మరియు ఏదైనా అధిక ప్రోటీన్ ఆహారం వంటి స్నాక్ ఐటమ్స్
డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం అవసరమైన మందులు
వాటర్ బాటిల్ (500 ml)
గ్లూకోమీటర్ మరియు గ్లూకోజ్ టెస్టింగ్ స్ట్రిప్స్
నిరంతర గ్లూకోజ్ మానిటరింగ్ (CGM) యంత్రం
ఫ్లాష్ గ్లూకోజ్ మానిటరింగ్ (FGM) యంత్రం లేదా ఇన్సులిన్ పంపులు
ఈ సౌకర్యాలను పొందేందుకు విద్యార్థులు ఈ విధానాలను అనుసరించాలి
LOC నమోదు/సమర్పణ సమయంలో విద్యార్థులు టైప్-1 డయాబెటిస్‌తో బాధపడుతున్నారనే సమాచారాన్ని తప్పనిసరిగా అందించాలి.
పాఠశాల/విద్యార్థి/తల్లిదండ్రులు పరీక్ష ప్రారంభానికి కనీసం ఒక రోజు ముందు పరీక్షా కేంద్రానికి చేరుకుని.. విద్యార్థులు తీసుకెళ్లాల్సిన వస్తువుల గురించి సెంటర్ సూపరింటెండెంట్‌కు తెలియజేయాలి.
పరీక్ష రోజు కూడా, విద్యార్థి పరీక్షల ప్రారంభానికి కనీసం 45 నిమిషాల ముందు పాఠశాలకు చేరుకోవాలి. వారు 9:45 గంటలకు హాల్‌కు చేరుకోవాలి.
ఈ పత్రాలను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి.
పరీక్షల సమయంలో CM/FGM/ఇన్సులిన్ పంప్ కోసం వైద్య నిపుణుడి సిఫార్సులు.
విద్యార్థులకు CM/FM/ఇన్సులిన్ పంప్ అందించబడుతుంది
కమ్యూనికేషన్ పరికరం మాత్రం తీసుకురాకూడదు
తాజావార్తలు
-
Nani New Movie: మలయాళ స్టార్‌తో సినిమా కోసం రంగంలోకి ‘ది ప్యారడైజ్’ హీరో!
-
Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!