హైదరాబాద్ లోని శంషాబాద్ లో ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు ప్రభుత్వ పాఠశాలలో వెలుగు చూసింది. అయితే, పాఠశాల సమీపంలో విద్యార్థులకు గత కొద్ది రోజులుగా పాన్ డబ్బాల యజమానులు చాక్లెట్లు పంపిణీ చేస్తున్నారు. ఇక, ఆ చాక్లెట్లు తిని తరగతి గదిలో మత్తులోకి జారడంతో పాటు విద్యార్థులు వింతగా ప్రవర్తించడం చేస్తున్నారు. విద్యార్థుల వింత ప్రవర్తన గమనించిన ఉపాధ్యాయులు.. విద్యార్థులను ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చాక్లెట్లు తినడం వల్లే విద్యార్థుల వింతగా ప్రవర్తన అని గుర్తించిన టీచర్లు.. పాన్ డబ్బాల యజమానులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Sonia Gandhi: సోనియా గాంధీ పేరుతో ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తు..
ఎన్టీవీ తో కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇంచార్జి రవికుమార్ మాట్లాడుతూ.. మా స్కూలు పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా గ్రామీణ వాతావరణం ఉంటుంది.. ఎక్కువగా కంపెనీలలో పని చేసే వాళ్ళ పిల్లలు మా స్కూల్లో చదువుతుంటారు.. స్కూల్ కి మార్నింగ్ వచ్చేటప్పుడే కొంతమంది పిల్లలు తినకుండా వస్తారు.. దీంతో నీరసంగా ఉండటం గమనించి, తాము బిస్కెట్లు వాటరు ఇస్తూ ఊన్నాము.. కానీ గత కొద్ది రోజులుగా కొంతమంది విద్యార్థులు తరగతి గదుల్లో పడుకొని ఉండడం చూశారు హెడ్మాస్టర్.. అలాంటి విద్యార్థులను పిలిపించి వాళ్లతో మాట్లాడారు.. అప్పుడు ఈ చాక్లెట్లకు సంబంధించిన అంశం తెలిసింది.. వెంటనే పోలీసులకు, ఇతర అధికారులకు సమాచారం ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. ఔట్ సైడ్ ఫుడ్ తినొద్దని పిల్లలకు రోజు చెప్తూ ఉంటాము.. అయినా, చాక్లెట్లు అనే సరికి తీసుకొని తింటున్నారు.. ఇంకా ఎంత మంది విద్యార్థులు ఈ విధంగా ఉన్నారో పూర్తిస్థాయిలో తెలియదు అని స్కూల్ ఇంచార్జ్ రవికుమార్ చెప్పుకొచ్చారు.